Categories: entertainmentNews

Intinti Gruhalakshmi 10 August Today Episode : తులసి విషయంలో నందుని నిందించిన లాస్య, వైజాగ్ ప్రయాణానికి బయలుదేరిన తులసి

Intinti Gruhalakshmi 10 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 10-August-2022(707 episode) ఎపిసోడ్ ముందుగా మీ కోసం. లాస్య, నందు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు తులసి గురించి, అప్పుడు లాస్య, తులసి ఇలా ప్రవర్తించడానికి కారణం నువ్వే, నువ్వు చూపించలేని ప్రపంచాన్ని ఇప్పుడు సామ్రాట్ చూపించబోతున్నాడు అని అనగానే, నందు ఊహించుకుంటాడు తులసి గురించి, గతంలో జరిగిన విషయాన్ని, గతంలో తులసి తన బుక్కులో తనకి ఉన్న చిన్న చిన్న కోరికలను రాస్తూ ఉంటుంది, విమానం ఎక్కడం, పాట పాడడం, ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకోవడం, ఇలా రాస్తూ ఉండగానే నందు వస్తాడు, ఏంటి అని అనగానే,డైరీ చూపిస్తుంది, అప్పుడు నందు పిచ్చిరాతలు ఆపి, నా ప్రయాణానికి బట్టలు సర్దు అని చెప్పి, వెళ్లిపోతాడు, దాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నందు ఇప్పుడు.అప్పుడు నువ్వు చేసింది తప్పు అని నేను అనడం లేదు నందు కానీ, నీ పరిస్థితి అలాంటిది కానీ ఇప్పుడు తులసికి మాత్రం అది తప్పులానే కనిపిస్తుంది.

ఎలాగైనా తనని మనం ఇప్పుడు ఆపకపోతే తను సామ్రాట్ కంపెనీకి బాస్ గా కూర్చుంటుంది అని, ఇలా మాట్లాడుతూ ఉంటుంది లాస్య నందుతో. తులసి ఇంట్లో వాళ్లు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, అప్పుడు తులసి నాకు విమానం ఎక్కుతున్నoదుకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే, అంకిత అప్పుడు తులసితో, అంటీ నేను చిన్నప్పటి నుంచి విమానం ఎక్కుతూనే ఉన్నాను, విమానంలో సెల్ఫీలు దిగుతుంటే, ఎందుకు వీళ్లు ఇంత సంతోషపడుతున్నారు అని అనిపించేది, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అర్థమయింది, ఒక మధ్యతరగతి వాళ్ళకి విమానం ఎక్కడంలో ఎంత సంతోషం ఉంటుందో అని అనగానే, ఆ అవునమ్మా చాలామందికి నాలాగే విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది, ఇప్పటికీ ఊర్లల్లో విమానం వెళుతుంటే కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంటారు, అని మాట్లాడుతూ ఉంటుంది.

Intinti Gruhalakshmi 10 August Today Episode : తులసి విషయంలో నందుని నిందించిన లాస్య

Intinti Gruhalakshmi 10 August Today Episode

తులసి అవును ప్రయాణానికి డబ్బులు కట్టాలి కదా అని అనగానే, అప్పుడు అంకిత,ప్రేమ్ మనం కట్టాల్సిన అవసరం లేదు, సామ్రాట్గారూ కంపెనీ తరపున తీసుకెళ్తున్నారు కదా, అంతా ఆయనే చూసుకుంటారు అని అంటుంది. అప్పుడు తులసి మనమూ ఫుడ్డు తీసుకొని వెళ్లొచ్చా, ఎంచక్క పులిహోర చేసుకోని తీసుకెళ్లొచ్చు అనగానే, అప్పుడు దివ్య వాళ్ళు అందరూ నవ్వుకుంటూ లేదు అమ్మా వాళ్ళు ఫ్రీగా పెడతారు అని అంటుంది.ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సామ్రాట్ ఫోన్ చేస్తారు తులసికి, రేపు ప్రయాణం పదింటికి, ఎనిమిదింటికే ఎయిర్పోర్ట్కి రావాలి అని చెబుతాడు.సామ్రాట్ ఎయిర్పోర్టుకు వెళ్లి, ఏంటి తులసిగారు ఇంకా రాలేదు అని ఫోన్ చేయగానే, నిద్రపట్టేసింది లేవలేదు అని, హడావిడిగా లేస్తు, కిందపడ్డట్టు, ఇదంతా తులసి కలగంటోంది.

తర్వాత తులసి తయారై, దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది. తులసి అత్తామామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.ప్రేమ్ ఆటో వచ్చింది అమ్మా అని అనగానే, బ్యాక్ పట్టుకుంటాను అమ్మ అనగానే, లేదు నేనే పట్టుకుంటాను అని అనగానే, అప్పుడు అభి ఏంటమ్మా మీ ఫ్రెండ్ కార్ పంపించలేదా అనగానే, తులసి ఆయన పంపిస్తా అన్నాడు, నేనే వద్దన్నాను అని, ఒక చిన్న సవరణ అంటూ సామ్రాట్గారు నా ఫ్రెండ్ కాదు, ఆయన బిజినెస్ భాగస్వామి అని అంటుంది, అప్పుడు ప్రేమ్ అభి తొ అమ్మని బాధపెట్టకుండా ఉండవా ఏదో ఒకటి అంటూ ఉంటావు అని అంటాడు. తర్వాత అందరూ తులసి కి జాగ్రత్త అని చెపుతూ, తనని ఫ్లైట్ ఎక్కగానే ఫోన్ చూస్తూ ఉండమని, ఆరోగ్యం జాగ్రత్త అని, జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago