Janaki Kalaganaledu 2 August Today Episode 357
Janaki Kalaganaledu 2 August Today Episode 357 : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 2 మంగళవారం ఎపిసోడ్ 357 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మల్లిక, జానకిని అనరాని మాటలు అంటుంటే అంతలో అక్కడికి గోవిందరాజు వచ్చి మల్లిక ను నువ్వు ఈ కార్యక్రమం అయిపోయే వరకు నీ నోరు కొద్దిగా అదుపులో పెట్టుకోమ్మా… నీ పెట్రోల్ పోసే కార్యక్రమాలు ఆపమ్మ లేకపోతే బాగోదు అని అంటాడు. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు గోవిందరాజు మల్లికకు నువ్వు బాధ్యత అప్ప చెప్పావంట కదా.. తను మమ్మల్ని అందరినీ తన ఆధీనంలో పనిచేయమని అడుగుతుంది. మేమందరం వింటున్నాం. అంతే జ్ఞానం అని గోవిందరాజు అంటాడు. జ్ఞానాంబ మల్లికను విగ్రహాన్ని శుద్ధి చేసి తీసుకురా… అని చెప్తుంది. అప్పుడు మీ మాట వేద వాకు అత్తయ్య గారు అని తీసుకొని వెళ్తుంది.
జ్ఞానంబ జానకిని ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు అని ఇన్ డైరెక్టుగా అంటుంది. అప్పుడు గోవిందరాజు పిల్లలులేదు సరదాగా చేస్తున్నారు కదా… మనం ఇక్కడి నుంచి వెళ్దాం అని జ్ఞానంబను తీసుకుని వెళ్తాడు. రామ వ్రతానికి నైవేద్యం చేస్తుండగా తన చేతి మీద నూనె పడుతుంది. అప్పుడు అమ్మ అని గట్టిగా అరుస్తాడు. జ్ఞానాంబ అక్కడే ఉంటుంది కానీ తన దగ్గరికి రాదు. ఇంతలో జానకి అక్కడికి వచ్చి రామ గారు రండి ముందు రాస్తాను. అని అంటుంది. అప్పుడు నాకు వద్దు జానకి గారు అని అంటాడు. అదేంటండి నూనె చేతి మీద పడితే అలా అంటారు. ఈ నొప్పి కన్నా మా అమ్మ నా దగ్గరికి రాలేదన్న బాదే… ప్రాణం పోయినట్లుగా ఉందండి. అని అంటాడు. మా అమ్మ నాకు చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తన ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది.
నాకేమైనా అయితే తను తట్టుకోలేదండి. నేనంటే ఎంతో ప్రేమ ఆ ప్రేమ అంత ఇప్పుడు ఏమైపోయిందండి. తను నా దగ్గరికి రాకుండా అక్కడే ఆగిపోయింది. ఈ నొప్పి కన్నా ఆ బాధ నా గుండెల్ని మెలిపెడుతుందండి. అని అంటాడు. రామ, జ్ఞానాంబ పక్కకి వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి వ్రతానికి ముత్తైదులు వస్తారు. ఆ ముత్తైదులలో ఒకరు ఏంటి జ్ఞానాంబ ఇల్లంతా కలకలలాడుతుంది. కానీ నీ ముఖంలో మాత్రం సంతోషం కనబడట్లేదు ఏమైంది. అని అడుగుతుంది. నువ్వు ఎప్పుడు మా ఇంట్లో గొడవలు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తావు కదా… అలాంటిది ఏం లేదులే గాని పదండి అని అంటుంది జ్ఞానం. జ్ఞానాంబ మల్లికను పిలుస్తుంది. ఆ విగ్రహం తీసుకొచ్చి పీట మీద పెట్టు అని అంటుంది. అప్పుడు అక్కడ ఉన్నవారు. అదేంటి జ్ఞానంబ వరలక్ష్మి వ్రతం అంటే పెద్ద కోడలే కదా చేయాల్సింది. మీ చిన్న కోడలు తో ఎందుకు చేపిస్తున్నావ్..
అని అడుగుతుంది. అప్పుడు జ్ఞానాంబ పోయిన సంవత్సరం పెద్ద కోడలు చేపించాము. ఇప్పుడు చిన్న కోడలు చేతుల మీదుగా చేయించాలని అనుకున్నాము. అని అంటుంది. ఆమె అదేంటి ఇదేమన్నా వంటనా ఒకసారి చిన్న కోడలు ఒకసారి పెద్ద కోడలు చేయడానికి అని అంటుంది. ఇంతలో విష్ణు మా ఆవిడ వరలక్ష్మి వ్రతం చేయాలని అన్నం తినడం మానేసింది. అసలే బక్క ప్రాణం కదా ఎక్కడ వాళ్ళ తాత దగ్గరికి పోతుందోనని మేమే చేయమని చెప్పాము. అని కామెడీ చేస్తాడు. అది కాదు బాబు అని అంటుండగా ఆమెని అందరూ మీరు పూజకు వచ్చారా.. లేదా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా అని అడుగుతుంటారు. ఇంతలో గోవిందరాజు అమ్మ మల్లిక నీ చేతిలో విగ్రహాన్ని జానకి కి ఇవ్వు జానకి నువ్వు వెళ్లి అది తీసుకొని ఆ పీట మీద పెట్టమ్మా అని గోవిందరాజు చెప్తాడు. కానీ జానకి ఆలోచిస్తూ ఉంటుంది. గోవిందరాజు పెట్టమ్మ ఏం కాదు అని అంటాడు. అప్పుడు జానకి ఆ విగ్రహాన్ని తీసుకొని వేటపై పెడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందే.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…