Janaki Kalaganaledu 3 August Today Episode 358
Janaki Kalaganaledu 3 August Today Episode 358 : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 3 బుధవారం ఎపిసోడ్ 358 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోవిందరాజు అమ్మ పుల్లల మల్లికా ఆ విగ్రహాన్ని జానకి ఇవ్వమ్మా అని అంటాడు. అప్పుడు జానకి విగ్రహాన్ని తీసుకొని అక్కడ పెట్టి అలంకరణ చేస్తుంది. పూజ జరిపించడానికి వచ్చిన అయ్యగారు జ్ఞానాంబను మీ పెద్ద కోడలు, మీ పెద్ద కొడుకుని వచ్చి కూర్చోమనండి అని అంటాడు. అప్పుడు జ్ఞానంబా ఈసారికి మా చిన్న కోడలు, మా చిన్న కొడుకు వచ్చి కూర్చుంటారు. మీరు పూజ జరిపించండి అని అంటుంది. అప్పుడు అయ్యగారు అదేంటమ్మా పెద్ద కోడలు, పెద్ద కొడుకు చేయటం ఆనవాయితీ కదా.. అని అంటాడు. అప్పుడు మల్లికా అలాంటివన్నీ ఏమీ లేవు అని గబగబా వచ్చి కూర్చుంటుంది. అయ్యగారు పూజ జరిపిస్తూ ఉంటాడు. అయ్యగారు అందర్నీ కంకణాలు కట్టుకోమని చెప్తాడు. అప్పుడు అందరు కంకణాలు కట్టుకుంటారు.
మల్లిక జంట కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. జానకి వాళ్ళ జంట బాధపడుతూ ఉంటారు. అయ్యగారు మల్లికను అమ్మవారికి ఏదైనా స్తోత్రం చెప్పమ్మా అని అంటాడు. అప్పుడు మల్లికా కంగారుపడుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు అమ్మ పుల్లల మల్లికా అమ్మవారికి పాటంట పాడమ్మా అని అంటాడు. నీకు పుల్లలు పెట్టడమే గాని పాటలు ఎక్కడ వస్తాయి అని కామెడీ చేస్తూ ఉంటాడు. మల్లిక పాడపోయేసరికి జానకిని పాడమని గోవిందరాజు చెప్తాడు. అప్పుడు జానకి అమ్మవారికి పాట పాడుతుంది. అప్పుడు అయ్యగారు జానకి పాటను మెచ్చుకుంటాడు. అలాగే అందరు కూడా చాలా చక్కగా పాడవని మెచ్చుకుంటారు. అప్పుడు మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది. జానకి మీద.. పూజ ముగిసిన తర్వాత అయ్యగారు ఇన్తటితో పూజ ముగిసిందండి.. వాయనాలు ఇవ్వమని జ్ఞానం మల్లికకు చెప్తుంది.
అప్పుడు మల్లికా అందరికీ వాయినాలు ఇస్తుంది. కానీ జానకి ఇవ్వదు. తరువాత గోవిందరాజు అమ్మ జానకి నువ్వు కూడా మిగిలిన వారికి వాయనాలు ఇవ్వమ్మా అని అంటాడు. అప్పుడు జానకి జ్ఞానంబ దగ్గరికి వెళ్తుంటే తను పక్కకి వెళ్లిపోతుంది. గోవిందరాజు అమ్మ జానకి లెక్క ప్రకారం 9 మందికి వాయినాలు ఇవ్వాలి. కాబట్టి నువ్వు మీ అత్తయ్య గారికి కూడా వాయినం ఇవ్వు… లెక్క సరిపోతుంది అని అంటాడు. జ్ఞానంబ దగ్గరికి వచ్చి గోవిందరాజు ఏంటి జ్ఞానం అక్కడ వ్రతం జరుగుతుంటే నువ్వొచ్చి ఇక్కడ ఉన్నావ్ ఏంటి అని అడగగా… అప్పుడు జ్ఞానంబ అక్కడ నా అవసరం అయిపోయిందండి. అని అంటుంది. అప్పుడు గోవిందరాజు అది కాదు జ్ఞానం జానకి నీక్కూడా వాయనం ఇస్తే నువ్వు పిల్లలు ఇద్దరినీ ఆశీర్వదిస్తే అప్పుడు కదా వ్రతఫలం దక్కుతుంది.
అని అంటాడు. అవసరం లేదండి. అందరికీ ఇచ్చింది కదా నేను తీసుకోకపోతే ఏం కాదు లెండి అని అంటుంది. అప్పుడు గోవిందరాజు అది కాదు జ్ఞానం అమ్మల నువ్వు జానకిని దీవించకపోతే ఎలా అని అంటాడు గోవిందరాజు. అప్పుడు నేను ఎలా దీవించాలని వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చేసిన మోసమే నా గుండెల్ని పిండేస్తుంది అని అంటుంది. అప్పుడు గోవిందరాజు వాళ్లు చేసిన చిన్న తప్పుని క్షమించు జ్ఞానం నీ కొడుకు కళ్ళల్లోకి చూడు వాడు నువ్వు మాట్లాడట్లేదని ఎంత శోభానుభవిస్తున్నాడు. వాళ్లకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా జ్ఞానం. నువ్వు మాట్లాడకపోతే వాళ్ళిద్దరూ అల్లాడిపోతున్నారు జ్ఞానం అంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడవలసిందే..
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…