Janaki Kalaganaledu 4 August Today Episode 359
Janaki Kalaganaledu 4 August Today Episode 359 : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 4 గురువారం ఎపిసోడ్ 359 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… జ్ఞానాంబ పక్కకు వచ్చి బాధపడుతుండగా అక్కడికి కుటుంబ సభ్యులంతా వస్తారు. గోవిందరాజు జ్ఞానాంబను జానకి రామలను క్షమించమని అడుగుతూ ఉంటాడు. జ్ఞానం నీ పిల్లలు చేసిన చిన్న తప్పుకి నీ పేగు బంధం తెంపేసుకుంటావా.ఆ ప్రేమ బంధాన్ని వదిలేసుకుంటావా అని అంటుండగా.. ఆ బాధే నా గుండెలు నలిపేస్తుందండి. నా కొడుకు నాకు చెప్పకుండా నిద్ర కూడా పోడు అని గుడ్డిగా నమ్మాను. చివరికి ఈ అమ్మని నిజంగానే గుడ్డిదాన్ని చేసేసాడు. వాడికి వాడి భార్య కల అర్థమయింది. కానీ, ఈ అమ్మ బాధేంటో వాడికి అర్థం కాలేదు. వాడు నన్ను కాదండి, నా ప్రేమని, నా నమ్మకాన్ని అవమానించాడు. లేదు జ్ఞానం నీ కొడుకుని నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్… ఇన్ని సంవత్సరాలు నీ కొడుకుని నువ్వు పెంచిన కానీ అర్థం చేసుకోలేకపోతున్నావు. నిజంగా అర్థం చేసుకొని ఉంటే అటు భార్య,కల కోసం ఇటు నీ మాట కోసం తను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. నీకు అర్థం అయ్యి ఉండేది. నీ కొడుకు ఎప్పుడు నీ మాట జవదాటడు జ్ఞానం. నువ్వు జానకిని కూడా అపార్థం చేసుకున్నావు.
జ్ఞానం నీ కొడుకుని మార్చేసింది. తన మాటే నెగ్గిల చేసుకుంది అని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకుంటే ఆరోజు గుడిలో తన ప్రాణాలు అడ్డేసి మన అందరి ప్రాణాలు కాపాడింది. నువ్వు దానినైనా అర్థం చేసుకోలేక పోతున్నావా… రామ లక్ష్మణులు ఎలా తన తండ్రి మాట జవదాటరో ఈ రామ, జానకిలు కూడా అలాగే వాళ్ళు నీ మాట ఎప్పుడు జవదాటరు నిన్ను ఎప్పుడు అగౌరపరచరు. వాళ్లు ఈ ఇంటి కోసం ఎంతో తపన పడుతుంటారు. అని అంటుండగా జానకి జ్ఞానంబ కాళ్ళ మీద పడుతుంది. నాకు ఎలాంటి శిక్ష అయినా వేయండి. అత్తయ్య గారు కానీ మీ అబ్బాయితో మాట్లాడకుండా ఉండకండి తను ఎంతో కుమిలిపోతున్నాడు. అని బ్రతిమిలాడుతుంది. అప్పుడు జ్ఞానాంబ కరిగి లేమ్మా అని పట్టుకుని లేపుతుంది. అప్పుడు జానకి వాయనం తీసుకొచ్చి ఇస్తుంది. జ్ఞానాంబ వాయునం తీసుకొని జానకిని ఆశీర్వదిస్తుంది. అంతటితో అందరూ సంతోషం పడిపోతూ ఉంటారు. మల్లిక మాత్రం బాధతో కంగు తింటుంది. కట్ చేస్తే జానకి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గరికి వెళ్లి నాన్న నేను చిన్నప్పుడు నుంచి ఐపీఎస్ కావాలని నీ కల నేను నెరవేరుస్తానని నీకు మాటిచ్చాను నాన్న.
నువ్వు నన్ను పోలీస్ గా చూడాలి అని కోరుకున్నావు కానీ నువ్వు నాకు దూరమై నా కలను కన్నీళ్లుగా మార్చావు. కానీ నా భర్త ఆ బాధ్యతను తీసుకొని నెరవేర్చే క్రమంలో మా అత్తయ్య గారు భయంతో ఎంతో నలిగిపోతున్నారు. మా అత్తయ్య గారు మీరు లేని లోటు తీర్చారు. అమ్మల ఆదరించారు. అలాంటి అమ్మను మేము బాధ పెట్టలేము. తనకంటి వెంట నీటిని పెట్టించలేం. తనకోసం నేను చదువును ఆపేస్తాను. నీ కలను నెరవేర్చలేక పోతున్నాను నాన్న. మళ్లీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టి నీ కోరిక తీరుస్తాను. నాన్న. నన్ను ఈ జన్మకి క్షమించు నాన్న. అంటూ తన పుస్తకాలను చూస్తూ ఏడుస్తూ.. రామ దగ్గరికి వచ్చి రామ గారు నాకోసం, నా కల కోసం అత్తయ్య గారి ప్రేమకు దూరమయ్యారు.
నా చదువు కోసం అప్పులు చేసి అవమానపాలయ్యారు. ఎన్నో నిద్రలేని రాత్రులని గడిపారు నా కల నెరవేర్చాలని ఎన్నో కష్టాలు పడ్డారు. మీ కష్టానికి నేను ప్రతిఫలం చూపించలేకపోతున్నాను నన్ను క్షమించండి. ఈ పుస్తకాలు ఇక నాకు ఉపయోగపడవు స్వీట్ షాప్ కి తీసుకెళ్లండి. పొట్లాల కైనా ఉపయోగపడతాయి. అని అంటుంది జానకి, అప్పుడు రామ మీరు అలా ఏమీ అనుకోకండి జానకి గారు. అమ్మతో నెమ్మదిగా మాట్లాడి ఒప్పిస్తాను. నేను మాట్లాడతాను. అని అంటాడు. వద్దండి. రామ గారు ఇప్పటికీ చేసిన పాపం చాలు మళ్ళీ ఈ పాపాన్ని కొనసాగించొద్దండి. మళ్లీ అత్తయ్య గారిని బాధ పెట్టొద్దండి. అని జానకి అంటుంది. రామ అది కాదు జానకి గారు నేను అమ్మతో మాట్లాడి చూస్తాను. అని అంటాడు రామ, తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడవలసిందే.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…