Categories: entertainmentNews

Naga Chaithanya : స‌మంత‌తో న‌టించేందుకు నాగ చైత‌న్య సిద్ధ‌మా.. దాని గురించి ఏమ‌న్నాడంటే..!

Naga Chaithanya : తెలుగులో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు పొందిన నాగచైతన్య, సమంత గత ఏడాది అక్టోబ‌ర్‌లో విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. వారు విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి నిత్యం ఏదో ఒక విష‌యంలో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉన్నారు. నాగచైతన్య ఫ్యాన్స్ ఏమో సమంతను టార్గెట్ చేస్తూ ఉంటే.. సమంత ఫ్యాన్స్ ఏమో నాగచైత‌న్య‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసుకుంటున్నారు. వారి సినిమా రిలీజ్ స‌మ‌యంలో ఏదో ఒక సంద‌ర్భంలో విడాకుల టాపిక్ రావ‌డం, దానికి వీరు త‌మదైన శైలిలో జ‌వాబివ్వ‌డం, ఆ వెంట‌నే గాసిప్ రాయుళ్లు కొత్త క‌థ‌నాలు పుట్టించ‌డం ఇలా న‌డుస్తూనే ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే నాగ చైతన్య‌, స‌మంత ఇటు రీల్ లైఫ్‌లో కాని అటు రియ‌ల్ లైఫ్‌లో కాని క‌లిసి క‌నిపించే అవ‌కాశం లేక‌పోలేద‌ని అర్ద‌మ‌వుతుంది.

అద్భుత‌మే..నాగ చైత‌న్య న‌టించిన థ్యాంక్యూ చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పూర్తిగా విఫ‌ల‌మైంది. ఇక ఇప్పుడు లాల్ సింగ్ చ‌ద్దా చిత్రంతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్యకు సమంతతో భవిష్యత్తులో కలిసి నటించాల్సి వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది. దీనికి సమాదానంగా.. “భవిష్యత్తులో మేమిద్దరం కలిసి నటిస్తామో.. లేదో నాకు కూడా తెలియదు.. అది కాలమే నిర్ణయిస్తుంది.. ఒకవేళ మేమిద్దరం మళ్ళీ సినిమాలలో నటించే అవకాశం వస్తే అది క్రేజీనే అవుతుంది”.. అంటూ చైతూ తెలిపారు.

Naga Chaithanya : స‌మంత‌తో న‌టించేందుకు నాగ చైత‌న్య సిద్ధ‌మా.

naga chaithanya comments on acting with samantha

ఇక ఈ మధ్య తనపై వస్తున్న రూమర్స్‌ను చూసి ఎంతో నవ్వుకున్నానని.. ప్రతి వారం ఏదో ఒక రూమర్ బయటకు వస్తుందన్నాడు. తన జీవితానికి సంబంధం లేని విషయాలపై కూడా ప్రచారం జరుగుతోందన్నాడు. మొదట్లో నవ్వుకున్నానని.. ఇప్పుడు పట్టించుకోవడం మానేశానని చెప్పాడు. పరోక్షంగా నటి శోభిత ధూళిపాళతో చై డేటింగ్‌లో ఉన్నాడంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై కూడా స్పందించిన నాగ చైతన్య చిన్న చిరున‌వ్వుతోనే స‌మాధానం ఇచ్చాడు. కాగా, డైవర్స్ తరువాత ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోగా.. ఫ్యాన్స్ మాత్రం నిత్యం ఆ విడాకుల మ్యాటర్‌నే ప్రస్తావిస్తూ రచ్చ చేస్తున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago