Karthika Deepam 11 August 2022 Episode
Karthika Deepam 11 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదల అయింది. 11 గురువారం ఎపిసోడ్ 1428 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. స్వప్న తన తప్పును తెలుసుకొని సత్యంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సత్యం కొన్ని నిజాలు స్వప్నకి చెప్తాడు. కట్ చేస్తే సౌర్య నిరూపం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలో అక్కడికి నిరుపం వచ్చి శౌర్య కళ్ళను మూస్తాడు. అప్పుడు శౌర్య తన చేతుల్ని పట్టుకొని డాక్టర్ సాబ్ అని అంటుంది. అప్పుడు నీరూపం ఆశ్చర్యంగా అలా ఎలా తెలుసుకున్నావు శౌర్య. నువ్వు సూపర్ అని అంటాడు. అప్పుడు సౌర్య నాకు తెలిసిపోతుంది అంతే అని అంటుంది. అవును సౌర్య ఎవరికి తెలియకుండా ఆ రౌడీలని భలేగా తీసుకొచ్చి శోభాని సింపుల్గా పట్టించేశారు. ఎవరు చేయలేని పని నువ్వు చేసావు.
థాంక్స్ సౌర్య అని నిరూపం తన చేతుల్ని పట్టుకుంటాడు. అప్పుడు శౌర్య తన చేతుల్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం పుండు మీద కారం చలినట్లుగా అనిపిస్తుంది. మీరు ఇక హ్యాపీ కదా. మీ పెళ్లికి ఇక ఎటువంటి అడ్డంకి లేదు ఇక మీరు సంతోషంగా పెళ్లి చేసుకోండి అని సౌర్య అంటుంది. కట్ చేస్తే హిమ, ప్రేమ్ లు ఈ పెళ్లిని ఎలాగైనా ఏదైనా చేసి ఆపాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. హిమ, ప్రేమ్ బావ ఈ పెళ్లిని ఎలాగైనా ఆపు అని అంటుంది. అప్పుడు ప్రేమ్ నీకెందుకు హిమ నేనున్నాను కదా అని అంటాడు. కట్ చేస్తే సౌర్య కు స్వప్న మెహందీ పెట్టాలని వస్తుంది. సౌర్య నాకొద్దు మీ కోడలికి పెట్టుకో అని అంటుంది. నువ్వు కూడా నా కోడలువె కదా సౌర్య అని స్వప్న అంటుంది. ఇప్పుడు నీకు కొత్తగా ప్రేమలు పుట్టుకొస్తున్నాయా అత్త అని అంటుంది. నాకు ప్రేమలు, బంధాలు వాటి విలువలు ఇప్పుడు తెలిసి వచ్చింది సౌర్య అని అంటుంది.
అప్పుడు హిమ నీరుపంలు అక్కడికి వస్తారు. మెహందీ కదా పెట్టించుకోవచ్చు కదా శౌర్య. ఈ గోరింటాకు కి మొగుడికి ఏదో సంబంధం ఉంటుందంట కదా అని నిరూపము అంటాడు. అప్పుడు సౌర్య కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ శౌర్య ఎప్పుడు మనల్ని అర్థం చేసుకుంటుందో ఎప్పుడు మారుతుందో అని అంటారు. అంతలో ఆనందరావు స్వప్నను నువ్వు మారటానికి ఇంత టైం పట్టింది. తను కూడా మారుతుంది లే చిన్నగా అని అంటాడు. కట్ చేస్తే సౌర్య నిరూపం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అక్కడికి సౌందర్య వెళుతుంది. ఎందుకే నువ్వు ఒక్కదానివే కూర్చున్నావు ఇక్కడ. అందరూ ఇంట్లో ఉంటే అని అంటుంది.
అప్పుడు మీరు అందరూ ఒకటి నాయనమ్మ నేనొక్కదాన్నే ఒకటి. అని అంటుంది. అప్పుడు సౌందర్య ఎందుకే నీకు నువ్వే అని ఊహించుకుంటావు మేము చెప్పింది ఏది నీ మనసుకి తీసుకోవు అని అంటుంది సౌందర్యం. అప్పుడు సౌర్య నాకు మనసు ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు నాయనమ్మ. ఎందుకంటే నేను చిన్నప్పుడు పారిపోయినప్పుడు నాకోసం మీరు వెతకలేదు కనీసం ట్రై కూడా చేయలేదు. అప్పుడే నా మనసు విరిగిపోయింది నాయనమ్మ అంటుంది శౌర్య. అప్పుడు సౌందర్య తనని చిన్నప్పుడు వెతికిన సంగతిని తనకి చెప్తుంది. అంటే చిన్నప్పుడు జరిగిన సంఘటనంతా కళ్ళకు కట్టినట్లుగా సౌర్యకు చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…