Mahesh Babu play dual role in ssmb28 movie
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ సర్కారు వారి పాట ‘ సినిమా సక్సెస్ తరువాత మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ ssmb28 ‘ లో నటించబోతున్నాడు. అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా మహేష్ బాబు డ్యూయల్ రోల్ ప్లే చేయలేదు. తొలిసారి ఈ మూవీలో డబుల్ యాక్షన్ చేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో మరో మహేష్ బాబు కనిపిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే చిత్ర యూనిట్ నుంచి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తారని, కథ ప్రకారం రెండో హీరోయిన్ అవసరమవడంతో మూవీ మేకర్స్ ఆ పనిలో ఉన్నారంటూ టాక్ వస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.
ఈ ‘ ssmb28 ‘ సినిమా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ సినిమా. గతంలో ‘ అతడు ‘, ‘ ఖలేజా ‘ సినిమాలు వచ్చాయి. అతడు మూవీ ఎంతలా బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. ‘ ఖలేజా ‘ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మళ్లీ దాదాపు కొద్ది రోజుల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘ అలవైకుంఠపురం లో ‘బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ‘ భీమ్లా నాయక్ ‘ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు త్రివిక్రమ్. ఆ తర్వాత మహేష్ బాబుతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…