New anchor in jabardasth show latest promo relised
Jabardasth : బుల్లితెరలో బాగా పాపులర్ అయిన షో జబర్దస్త్. ఈ షో కి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఈ షో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళుతుండడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్ లో కన్ఫామ్ చేసింది. చివరి ఎపిసోడ్ లో అనసూయ పైన స్కిట్ చేసారు జబర్దస్త్ కమెడియన్స్. జబర్దస్త్ కోసం అనసూయ ఎలా కష్టపడిందో చెబుతూ ఆమెపై కొన్ని సెటైర్లు కూడా వేశారు. పిల్లలను తల్లి వద్ద వదిలి కూడా జబర్దస్త్ చేశారు అంటూ ఆమె కష్టాన్ని గుర్తు చేశారు.
అనసూయ ను మిస్ అవుతున్నామని అంటూ జడ్జ్ ఇంద్రజ కూడా ఎమోషనల్ అయింది. కెమెరాలు మొత్తం అనసూయ చుట్టు తిప్పిన ఆమె నుంచి కన్నీళ్లు రాలేదు. అసలు ఏమాత్రం కంటి చుక్క కార్చకుండా అనసూయ జబర్దస్త్ షో కు బై బై చెప్పేసింది. దీంతో అనసూయ స్థానంలో ఏ యాంకర్ వస్తుందో అని సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ చూసినా జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరని చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో జబర్దస్త్ కొత్త యాంకర్ రాబోతుంది అని చెప్పేశారు.
ఆగస్టు 4న ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ లో కొత్త యాంకర్ కను విందు చేయనుంది. ఈ క్రమంలోనే ఆమెను పల్లకిలో తీసుకొస్తూ జబర్దస్త్ కి స్వాగతం చెబుతున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. కొత్త యాంకర్ వస్తుందని చెప్పారు కానీ ఆమె ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరై ఉంటారని సందేహాలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే జబర్దస్త్ కొత్త యాంకర్ గా మంజుషను తీసుకున్నారని టాక్ అయితే బయటకు వచ్చింది. అయితే మంజూషానే పరిచయం చేస్తారా లేక ఏదన్న ట్విస్ట్ ఇస్తారా అనేది చూడాలి. అయితే ఈ ఎపిసోడ్ కి ‘ కార్తికేయ 2 ‘మూవీ టీం నిఖిల్, శ్రీనివాసరెడ్డి ,దర్శకుడు చందు మొండేటి రావడం విశేషం. ఈ కార్తికేయ టీం జబర్దస్త్ లోఎలా సందడి చేస్తుందో ఆగస్టు 4 వరకు వేచి చూడాలి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…