nikhil movie karthikeya2 once agin postponed to release
Nikhil : హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన యువ కథానాయకుడు నిఖిల్. హైదరాబద్ నవాబ్స్ అనే సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చినా ఆయనకు మొదటి హిట్ మాత్రం హ్యాపీ డేస్ సినిమానే. యువత, స్వామి రారా, కేశవ, అర్జున్ సురవరం, కార్తికేయ, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా వంటి సినిమాలతో నిఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
మళ్లీ వాయిదా..!అప్పుడెప్పుడో సెట్స్ మీదకు తీసుకొచ్చిన ‘కార్తికేయ 2’ సినిమా కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. అంతా ఓకే అనుకొని జూలై 22వ తేదీన సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు. కాని చివరి నిమిషంలో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. అనంతరం ఆగస్ట్ 12న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే ఆగస్ట్ 11న ‘లాల్ సింగ్ చడ్డా’.. 12న ‘మాచర్ల నియోజవర్గం’ సినిమాలు విడుదలకి సిద్దంగా ఉన్నాయి. డబ్బింగ్ చిత్రంతో పెద్దగా ఇబ్బందేమీ లేదు కానీ.. ఇండిపెండెన్స్ వీక్ లో రెండు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చింది.
ఈ క్రమంలో తప్పక నిఖిల్ తన చిత్రాన్ని మరో రోజుకి వాయిదా వేయాల్సి వచ్చింది. ఆగస్ట్ 13న తన చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాగు కోసం క్లాష్ ఉండకూడదు అని అందరు అనుకోవడం కరెక్ట్ కాని, ప్రతి సారి నన్ను వెనక్కి తగ్గమనడం బాధేస్తుంది అంటూ నిఖిల్ అన్నాడు. నిజానికి రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికే రెండు సార్లు వెనక్కి వెళ్లిన నిఖిల్ కి ఆగస్ట్ 12 కూడా అంత సులభంగా దొరకలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. ఆగస్ట్ 12న ‘కార్తికేయ 2’ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసేటప్పుడు అక్టోబర్ కి లేదా నవంబర్ కి వెళ్లిపోండి. మీ సినిమాకు థియేటర్స్ దొరకవు. ఇప్పుడప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదన్నారు. ఆరోజు నేను చాల ఏడ్చాను. నువ్వు ఎంత కష్టపడ్డా నీ సినిమా రిలీజ్ అవుదు అన్నప్పుడు బాధేసింది అని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…