Health benefits of Green Chilli
Green Chilli : పచ్చిమిర్చిని మనం ఎక్కువగా కూరల్లో ఘాటు కోసం వాడుతాం. మిరపకాయ లేని వంటిల్లు ఎక్కడ కనిపించదు. ఎండిమిర్చి కన్నా పచ్చిమిర్చి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పచ్చిమిర్చితో చేసిన ఏ వంట అయినా రుచి అదిరిపోతుంది. చాలామందికి దీనిలో పోషక ఔషధ గుణాలు గురించి తెలియదు. మిరపకాయలు అధిక కారంగా ఉండడానికి కారణం దీనిలోని కెప్రిసిన్ అని ఆల్కలాయిడ్. గ్రీన్ చిల్లీ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది రక్త పోటు, గుండె జబ్బుల సంబంధిత వ్యాధులను అరికడుతుంది.
ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పచ్చిమిర్చి భోజనం రుచి పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో కేలరీలు జీరో. పచ్చిమిరపకాయను తరచుగా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పచ్చిమిర్చి లో పుల్లటి విటమిన్ సి కూడా ఉంటుంది. రోజు పెరుగన్నం తో పాటు ఒక పచ్చి మిర్చి తినడం వల్ల బాడీకి కావలసిన విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దగ్గు జలుబు వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ మిర్చిని ఎక్కువగా తినాలి. పచ్చిమిర్చి చాలా రకాల వైరస్లు, బ్యాక్టీరియాలా బారిన పడకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ మిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
అలాగే చర్మం యవ్వనంగా కాంతివంతంగా చేయడంలో పచ్చిమిర్చి లోపల నుంచి సహాయపడతాయి. ఈ మిర్చిని తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరం అవుతాయి. ఈ మిర్చిలో ప్రా టెస్ట్ క్యాన్సర్ ను తగ్గించే గుణాలు ఉన్నాయి. పచ్చిమిర్చిని వంట వండిన తరువాత ఆపైన సన్నగా తరిగి కూరల్లో వేసుకుంటే దీనిలో గుణాలు పోకుండా… మన శరీరానికి అందుతాయి. మిరపకాయ ముఖ్యంగా ఎముకలు బలహీనత, కనుగుడ్లు పొడిబారటం, చర్మం ముడతలు పడకుండా నిరోధించుట గుణాలు కలిగినటువంటిది
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…