nikil viral coments are on anupama
NiKiL : అనుపమ పరమేశ్వరన్ గురించి తెలిసే ఉంటుంది. ఆకట్టుకునే అందం, అంతకుమించి టాలెంట్ ఉన్న హీరోయిన్లలో ఒకరు అనుపమ. వరుస సినిమాలు చేస్తున్న ఒక్కటి కూడా హిట్ కావడం లేదు. అయితే త్వరలో నిఖిల్ హీరోగా నటించబోతున్న ‘ కార్తికేయ 2 ‘ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. 2014లో విడుదలైన కార్తికేయకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్, అనుపమ కేర్, శ్రీనివాసరెడ్డి, ఆదిత్య మీనన్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు.
‘ కార్తికేయ 2 ‘ చిత్రం జూలైలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడ్డది. అయితే ఇప్పుడు ఆగస్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్యనే వచ్చిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా హీరో నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే హీరోయిన్ అనుపమ గురించి కూడా కొన్ని విషయాలను చెప్పారు.. హీరోయిన్ అనుపమ ప్రమోషన్స్ కు రాదంటూ ఆమెపై నవ్వుతూనే కామెంట్స్ చేశాడు. ఉదయం ఐదు గంటలకే షూటింగ్ అన్న వచ్చేస్తుంది. చాలా ప్రొఫెషనల్ గా ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ సినిమా ప్రమోషన్ అంటే ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు అంటూ నిఖిల్ కామెంట్స్ చేశారు.
నిఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిజానికి అనుపమ మొదట్లో సినిమా ఇంటర్వ్యూలలో చురుగ్గా పాల్గొనేది. కానీ ఇప్పుడు చురుకుదనం కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన నాని ‘ అంటే సుందరానికి ‘ సినిమాలో అనుపమ ఓ పాత్రను పోషించింది. కానీ విడుదల సమయంలో ఆమె కనీసం ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొనలేదు. అసలు సినిమా చూసేంతవరకు ఆమె ఉందన్న విషయమే ఎవరికీ తెలియదు. అసలే సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న అనుపమ ఇలా ప్రచార కార్యక్రమాలకు రాకపోతే ఎలా అని దానివల్ల కెరీర్ మరింత ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…