Pavithra lokesh and naresh agreement conditions
Pavithra Lokesh : సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంపై అనేక వార్తలు వస్తున్నాయి. సినీ పరిశ్రమలో వీరిద్దరి వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియర్ హీరోయిన్, దర్శకనిర్మాత అయిన విజయనిర్మల తనయుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన నరేష్, అప్పట్లో హీరోగా నటించి అనేక హిట్ సినిమాలను చేశాడు. తర్వాత హీరోగా అవకాశాలు తగ్గాక కూడా ఏమాత్రం వెనుకకు తగ్గకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి, మామ పాత్రలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
ముగ్గురితో విభేదాల కారణంగా విడిపోయిన నరేష్, తాజాగా నటి పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ అనే నటుడిని వివాహం చేసుకుంది. అతడితో కొన్ని విభేదాల కారణంగా విడాకులు కు అప్లై చేసినట్టు తెలుస్తుంది. ఆ కేసు ఇంకా క్లోజ్ కాకముందే, నరేష్ పవిత్ర చట్టపట్టలేసుకొని తిరిగారు. చట్టబద్ధంగా కోర్టులో విడాకులు మంజూరు కాగానే నరేష్ పవిత్ర పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అంటున్నారు. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరికీ సంబంధించి అనేక వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి.
తాజాగా వీరిద్దరి అగ్రిమెంట్ కి సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తుంది. దీనిపై నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకెళితే అగ్రిమెంట్ ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ కు 25 లక్షల డబ్బులు ఇవ్వాలని, ఎప్పుడైనా ఆమెని వదిలేసిన, వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్న, ఆమెకు 50 కోట్లు ఇవ్వాలని అగ్రిమెంట్ రాయించుకున్నారట. ఇప్పటిదాకా వీళ్లది ఓల్డ్ లవ్ స్టోరీ అనుకుంటే ఇప్పుడు అగ్రిమెంట్ రిలేషన్షిప్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో అసలు నిజం ఏంటి అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం నరేష్ పవిత్ర లోకేష్ కు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…