Categories: entertainmentNews

Tollywood : టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే… ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ…

Tollywood : ఫ్రెండ్ షిప్ డే ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వస్తుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. సంతోషంలో, బాధలో, కష్టాల్లో, నష్టాల్లో వెన్నంటే ఉండే వ్యక్తి స్నేహితుడు. నమ్మితే ప్రాణాలైనా ఇచ్చేవాడే దోస్తు. అలాంటి దోస్తుల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ లోని స్టార్ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. డార్లింగ్ ప్రభాస్ కు చాలా మంది స్నేహితులే ఉన్నారు. ఆయనను ఇష్టపడని వారు ఉండరు. అయితే సినీ ఇండస్ట్రీలో మాత్రం ప్రభాస్ ఇష్టపడే దోస్తు హీరో గోపీచంద్. గోపీచంద్ కు సంబంధించి కొన్ని సినిమా ఈవెంట్లకు ప్రభాస్ హాజరైన విషయం తెలిసిందే. స్వయంగా ప్రభాసే గోపీచంద్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన విషయం తెలిసిందే.

ఇండస్ట్రీలో మరో దోస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ప్రారంభమైన వీరిద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక ఏజ్ గ్రూప్ కాకపోయినా వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాలను ఒకరితో మరొకరు పంచుకుంటారు. కొన్ని ప్రత్యేక రోజుల్లోనూ వీరిద్దరూ కలుస్తూనే ఉంటారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వీరి దోస్తును అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ వెండితెరకు పరిచయం కాకముందు ఎంతో మంచి స్నేహితులు. ఇండస్ట్రీలో వీరిద్దరి ఫ్రెండ్షిప్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికీ వీరు ఈవెంట్లకు, పార్టీలకు వెళ్తూనే ఉంటారు.

Tollywood : టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే…

beast friend in tollywood ntr ramcharan, prabhas, allu arjun , vijay devarakonda

ప్రత్యేకమైన రోజుల్లో స్పెషల్గా కలుస్తుంటారు. అలాగే రామ్ చరణ్ తేజ్ కు, రానాతో ఎంత ఫ్రెండ్ షిప్ ఉందో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా అంతే ఉంది. వీరిద్దరు మంచి స్నేహితులన్న విషయం ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ద్వారా తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వీరిద్దరూ ఎలా కలిసి ఉంటారో, పుట్టినరోజులను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత దగ్గరగా ఉంటారో తెలిసిందే. వీరిద్దరి ఫ్రెండ్షిప్ చూసి ఇండస్ట్రీనే ఫిదా అవుతుంది. పవన్ కళ్యాణ్ తీసుకునే కొన్ని నిర్ణయాల్లో త్రివిక్రమ్ సలహాలు సూచనలు చేస్తుంటారంట. అలాగే స్పెషల్ డేస్ లో వీరు ప్రత్యేకంగా కలుస్తూ సమయం గడుపుతుంటారు.

అలాగే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో చాలా దగ్గర ఫ్రెండ్ నవీన్ పోలిశెట్టి. వీరిద్దరి కెరీర్ ఒకేసారి మొదలైంది. ‘ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ‘ చిత్రంలో గోల్డ్ ఫేస్ యూత్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నవీన్ పోలిశెట్టి సినిమా ఫంక్షన్లకు విజయ్ హాజరై వారిద్దరి ఫ్రెండ్షిప్ గురించి కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ఫ్రెండ్షిప్ ఇండస్ట్రీ వరకే తెలుసు. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్తారని ఖాళీ సమయంలో అల్లు అర్జున్ సుకుమార్ తో సమయం గడిపేందుకు ఇష్టపడుతుంటారంట.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago