pawan-kalyan-waits-till-midnight-for-sri-leelas-arrival
Sreeleela – Pawan Kalyan : గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరిశంకర్ కాంబినేషన్ లో తెరకేక్కుతున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అయితే ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ” ఓజి ” సినిమా చేస్తున్నారు. దీంతో ఆ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సమానంగా కాల్ సీట్స్ కేటాయించారు. ఇక దీనికి సంబంధించిన షెడ్యూల్ వీడియోను హరిశంకర్ ఇటీవల విడుదల కూడా చేశారు. ఇక ఈ వీడియోకు ప్రస్తుతం ట్రెండింగ్ రెస్పాన్స్ వస్తుంది.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా కాస్త బిజీగా ఉండడంతో పాటు ,వారాహి యాత్ర చేయాల్సి ఉండడంతో ఉత్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. దీంతో ఈ నెల ఆఖరి వరకు పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగింది. ఇక శ్రీ లీల ఈరోజు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా అదే సమయంలో గుంటూరు కారం షూటింగ్ కూడా ఉండడంతో అనుకున్న టైం కు శ్రీ లీల భగత్ సింగ్ షూటింగ్ సెట్స్ కు రాలేకపోయిందట.
సాయంత్రం సమయానికి గుంటూరు కారం సినిమా షూటింగ్ అయిపోవడంతో భగత్ సింగ్ సినిమా సెట్స్ కు వచ్చింది. ఇక శ్రీ లీల రాత్రి 9 గంటలకు సెట్స్ లో అడుగుపెట్టగా రాత్రి 12:00 వరకు షూటింగ్ జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే శ్రీ లీల కోసం పవన్ కళ్యాణ్ అంతసేపు వేచి చూశాడంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి తన పని పట్ల ఉన్న డెడికేషన్ ఎలాంటిదో అర్థం అవుతుంది. అసలే రాజకీయాల్లో బిజీగా ఉంటున్నా పవన్ కాల్ సీట్స్ దొరకటం కూడా చాలా కష్టంగా ఉంది. అందుకే శ్రీలీల కోసం పవన్ కళ్యాణ్ ఇంతసేపు ఎదురు చూసినట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…