Categories: entertainmentNews

Mahesh babu : మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసిన యంగ్ హీరోయిన్

Mahesh babu : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా ‘ పెళ్లి సందడి ‘.ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్, ఆర్కే ఫిలిం అసోసియేషన్ కలిపి నిర్మించారు. పెళ్లి సందడి సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ సినిమాతో శ్రీ లీల బాగా పాపులర్ అయింది. తన అందంతో, డ్యాన్స్ తో, అభినయంతో కుర్ర కారు మనుసులను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా హిట్ కావడంతో తనకు సినీ ఇండస్ట్రీలో బాగా క్రేజ్ పెరిగింది. తన నటనకు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి.

ఈమధ్య ఈ కొత్త హీరోయిన్ శ్రీలీలకు మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త వచ్చింది. కాకపోతే ఈ సినిమాను శ్రీ లీల రిజెక్ట్ చేసింది. అయితే ఇప్పటికే మహేష్ బాబు నటించిన సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకోవాలి అనుకున్నారు చిత్ర బృందం. కానీ శ్రీ లీల ఈ సినిమాలో నటించడానికి నో చెప్పింది. దానికి గల కారణం ఏమిటో ఇలా చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. మహేష్ బాబు సినిమాలో నటించడానికి అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా రిజెక్ట్ చేయరు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రోల్ రావడంతో నో చెప్పాను. అప్ కమింగ్ హీరోయిన్ సీనియర్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తే వరుసగా మళ్లీ అవే క్యారెక్టర్స్ వస్తాయని చెప్పింది.

Mahesh babu : మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసిన యంగ్ హీరోయిన్

‘ Pelli sandadi ‘ heroin sreeleela rejected Mahesh babu movie

మరోవైపు శ్రీ లీల పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తూ బాగా బిజీగా ఉంది. ఇప్పుడు శ్రీలీల చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయట. అయితే ఆమెకు ఈ రేంజ్ లో అవకాశాలు రావడానికి కారణం దర్శకుడు రాఘవేంద్రరావు అని తెలిపింది. తెలుగు సినీ రంగంలో తనకు మొదటి అవకాశం ఇచ్చి తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు గారి రుణాన్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పుకొచ్చింది ఈ అందాల భామ. శ్రీలీల ప్రస్తుతం రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలయ్య, శర్వానంద్, నితిన్ సినిమాల్లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago