Categories: entertainmentNews

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్….పవర్ ఫుల్ లుక్ లో పవన్ కళ్యాణ్…

 

Hari Hara Veera Mallu :  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో హరిహర వీర మల్లు ఒకటి. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. అయితే ఇటీవల సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పుట్టినరోజు అవడంతో సినీ బృందం సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ లేటెస్ట్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. అయితే ఇంతకుముందు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లలో పవన్ కళ్యాణ్ క్లీన్ సేవ్ తో కనిపించగా ఇప్పుడు మాత్రం గడ్డంతో కనిపించాడు.

ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిందిగా ఈ పోస్టర్ కనిపిస్తుంది. ఇటీవల విడుదల చేసిన లుక్ చూస్తే డైరెక్టర్ క్రిష్.. పవన్ కళ్యాణ్ ను పలు రకాల లుక్ తో ప్రజెంట్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు విడుదల చేసిన లుక్ అయితే ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం సినీ బృందం ఇంత వరకు తెలియజేయలేదు.మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై దయాకర్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ నటుడు బాబి డియోల్ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

దీంతో మెగా అభిమానులు సినిమా రిలీజ్ డేట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్న ఇంకా సినిమా రిలీజ్ డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హరిహర వీరమల్లు పోస్టర్ ఎఫెక్ట్ ట్రెండ్ అవుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డే అవడంతో సినిమా పోస్టర్ తో పాటు పవన్ కళ్యాణ్ బర్త్డే విషెస్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago