Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో హరిహర వీర మల్లు ఒకటి. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. అయితే ఇటీవల సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పుట్టినరోజు అవడంతో సినీ బృందం సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ లేటెస్ట్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. అయితే ఇంతకుముందు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లలో పవన్ కళ్యాణ్ క్లీన్ సేవ్ తో కనిపించగా ఇప్పుడు మాత్రం గడ్డంతో కనిపించాడు.
ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిందిగా ఈ పోస్టర్ కనిపిస్తుంది. ఇటీవల విడుదల చేసిన లుక్ చూస్తే డైరెక్టర్ క్రిష్.. పవన్ కళ్యాణ్ ను పలు రకాల లుక్ తో ప్రజెంట్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు విడుదల చేసిన లుక్ అయితే ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం సినీ బృందం ఇంత వరకు తెలియజేయలేదు.మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై దయాకర్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ నటుడు బాబి డియోల్ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
దీంతో మెగా అభిమానులు సినిమా రిలీజ్ డేట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్న ఇంకా సినిమా రిలీజ్ డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హరిహర వీరమల్లు పోస్టర్ ఎఫెక్ట్ ట్రెండ్ అవుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డే అవడంతో సినిమా పోస్టర్ తో పాటు పవన్ కళ్యాణ్ బర్త్డే విషెస్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి.