search RRR in google you will get surprised by doodle
RRR : ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచమంతా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుకుంటోంది. భారతదేశం గర్వించదగ్గ సినిమాల్లో ఇది ఒకటి. ఏ భారతీయ సినిమాకు కూడా ఇప్పటి వరకు ఇంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రాలేదు. కానీ.. ఆర్ఆర్ఆర్ కు వస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యాక.. దాదాపు 60 దేశాల్లో ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది అంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
ఒక భారతీయ సినిమా.. ప్రపంచ దేశాల్లో రికార్డు సృష్టిస్తుంది అంటే అది ఇండియాకు గర్వకారణమే కదా. అందుకే.. ఈ సినిమాకు ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తనదైన శైలిలో నివాళులు అర్పించింది. సరికొత్త ట్రిబ్యూట్ ను అందించింది. గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి ఆర్ఆర్ఆర్ అని టైప్ చేస్తే చాలు సరికొత్త యానిమేషన్ ప్రత్యేకంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తయారుచేసిన డూడుల్ మనకు కనిపిస్తుంది.
సినిమాలో రామ్ చరణ్ వాడిన గుర్రం, ఎన్టీఆర్ వాడిన బుల్లెట్.. రెండింటితో కలిసి.. ఒక బుల్లెట్ బైక్, వెనుక గుర్రం యానిమేషన్స్ ను రూపొందించింది గూగుల్. ఆర్ఆర్ఆర్ అని సెర్చ్ ఇంజన్ లో టైప్ చేయగానే కింద చిన్న సైజ్ లో గుర్రం, బైక్ లెఫ్ట్ నుంచి రైట్ కు వెళ్లి మాయం అవుతాయి. అలాగే రిపీట్ అవుతూ కనిపిస్తాయి.
అయితే.. ఒక సినిమాకు అది కూడా ఇండియన్ మూవీకి గూగుల్ డూడుల్ క్రియేట్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఘనతను సాధించిన తొలి మూవీ ఆర్ఆర్ఆర్ కాగా.. ఆ మూవీ దర్శకుడు రాజమౌళికే ఆ క్రెడిట్ దక్కుతుంది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమానే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి.. మహేశ్ భాబుతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే మహేశ్ తో మూవీకి సంబంధించిన వివరాలను జక్కన్న మీడియాకు వివరించనున్నట్టు సమాచారం.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…