Senior actor Sarath Babu property matter
Sarath Babu : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు సీనియర్ నటుడు శరత్ బాబు. ఇక ఇటీవలే శరత్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకోని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో తెలుగు ఇండస్ట్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇకపోతే శరత్ బాబుకి సంతానం లేరు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంతానం కలగలేదు. ఈ క్రమంలోనే తన సోదరి సోదరులు పిల్లలకు దాదాపుగా 13 వాటాల ఆస్తులను పంచనున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం వాటి గురించి వారి మధ్య తగాదాలు మొదలయ్యాయి అని సమాచారం. ఒకవైపు శరత్ బాబు మరణం గురించి బాధపడుతుంటే మరోవైపు ఆయన ఆస్తి గొడవలు అభిమానులను కలచి వేస్తున్నాయి. ఆయన మరణం తర్వాత ఆస్తి గొడవలు ఎక్కువ అయ్యాయట. అంతేకాదు శరత్ బాబు చనిపోక ముందు నుంచి కూడా ఆస్తి విషయంలో చర్చలు జరుగుతున్నాయంటూ టాక్ వినిపించింది. ఇక శరత్ బాబుకి చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో ఖరీదైన భవనాలు ఉన్నాయట. అంతేకాదు ఎంతో విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. అలాగే మాల్స్, విల్లాలు వంటి ఖరీదైన ఆస్తులు కూడా శరత్ బాబుకు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఆస్తులు 13 కుటుంబాలకు చెందినట్లు సమాచారం.
ఏది ఏమైనా శరత్ బాబు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని చివరి రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడం అందరికీ బాధాకరంగా ఉంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు కోరుతున్నారు. ఇకపోతే శరత్ బాబు ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్లకు తండ్రిగా, అన్నగా నటించి మెప్పించారు. ఒకప్పటి సినిమాల్లో శరత్ బాబు కు సినిమాల్లో మంచి క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఆయనకు ఏమైందో ఏమో తెలియదు కానీ సినీ అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. దీంతో చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…