Categories: healthNews

Artificial Jewellery : ఆర్టిఫిషియల్ నగలతో అలర్జీకి గురవుతున్నారా…అయితే ఈ టిప్స్ పాటించండి…

Artificial Jewellery  : ఆడవారికి నగలపై ఎంత ఇష్టముంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినన అవసరం లేదు. అయితే కొందరు ఆర్థిక స్తోమతను బట్టి బంగారు నగలు ధరిస్తే..మరికొందరు వారికి తగినట్లుగా ఆర్టిఫిషియల్ ఆభరణాలను వేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రస్తుత కాలంలో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో చాలామంది మహిళలు ఆర్టిఫిషియల్ ఆభరణాలను ఎంచుకుంటున్నారు. అయితే ఈ నగలు తయారీలో ఉపయోగించే కొన్ని రకాల కెమికల్స్ కారణంగా చర్మం ఇన్ఫెక్షన్ కు గురవుతూ ఉంటుంది. దీని కారణంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

ఇలాంటి సమస్యలతో బాధపడే వారు మేము చెప్పే టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఆర్టిఫిషియల్ అభరణాల తయారీలో ముఖ్యంగా నికెల్ అనే లోహాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని కారణంగానే చాలా మందికి అలర్జీ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఆర్టిఫిషియల్ నగలు ధరిస్తే అలర్జీ వస్తుందని భయపడేవారు వాటిని వేసుకునే ముందు పౌడర్ లేదా మాయిశ్చరైజర్ ను చర్మానికి రాసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన అభరణాలలో ఉండే మెటల్ ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది.

అలాగే ఈ నగలను కొనుగోలు చేసిన వెంటనే అసలు వేసుకోకూడదు. ముందుగా దానికి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ను ఒక కోటింగ్ వేసుకోవాలి. ఇలా నెయిల్ పాలిష్ వేసిన తర్వాత ఆరబెట్టి తర్వాత ధరించడం మంచిది. దీనివలన లోహాల ప్రభావం చర్మం పై అస్సలు పడదు. అలాగే కొంతమంది మహిళలు మెడకు బిగుతుగా ఉండే ఆర్టిఫిషల్ నగలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీని కారణంగా అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చోకర్, నెక్ పీస్ వంటి ఆభరణాలు ధరించడం వలన మెడ ప్రాంతంలో గాలి సరిగా ఆడక అలర్జీ వస్తుంది. అందుకే వీలైనంతవరకు వదులుగా ఉండే అభరణాలు ధరించడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago