Categories: Newspolitics

కాంగ్రెస్ లోకి ఇందిరా శోభన్..?

తెలంగాణ రాజకీయ నాయకురాలు ఇందిరాశోభన్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనుందనే…? అనే ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. ప్రస్తుతం స్వతంత్ర నేతగా కొనసాగుతున్న ఆమె ఏదో ఒక పొలిటికల్ పార్టీ  ఫ్లాట్ ఫామ్ ను ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీరణ పేరిట పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారితోనే ఆమె కాంగ్రెస్ లో చేరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కేసీఆర్ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతోన్న ఇందిరా శోభన్…ఈసారి ఏ పార్టీలో చేరాలనే అంశంపై తొందరపాటుకు ఉపక్రమించవద్దని భావిస్తున్నారు. గతంలో తొందరపాటు నిర్ణయాలే ప్రస్తుత రాజకీయ అస్థిరతకు కారణమని ఇందిరా అనుకుంటున్నారు. అందుకే ఈసారి ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకోవాలని కొద్ది రోజులుగా తన రాజకీయ భవిష్యత్ పై సమాలోచనలు జరిపిన ఆమె.. కాంగ్రెస్ లో చేరాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గతంలో ఆమెకు బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. కొండా విశ్వేశ్వర్ లాంటి నేతలు ఇందిరాను బీజేపీలో చేరాలని కోరారు. ప్రస్తుతం కొండానే బీజేపీలో ఇమడలేకపొతున్నారు. బీఆర్ఎస్ – బీజేపీ ఒకటేననే అనుమానాలు ఉన్నాయని ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇందిరా శోభన్ కు కొండా చేసిన వ్యాఖ్యలు ఓ క్లారిటీ ఇచ్చినట్లు అనిపించింది. కేసీఆర్ పై పోరాడాలంటే కాంగ్రెస్సే సరైన వేదిక అని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల చేరిక సమయంలోనే ఇందిరా శోభన్ కాంగ్రెస్ లో చేరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారితోపాటు పార్టీ లో చేరితే తనకు ప్రాధాన్యత దక్కుతుందనే యోచనలో ఇందిరా ఉన్నారని టాక్ సోషల్ మీడియాలో జరుగుతోంది.

Also Read : కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – ఎల్బీ నగర్ నుంచి పోటీ..?

tech desk

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago