కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – ఎల్బీ నగర్ నుంచి పోటీ..?

గతేడాది కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీలో సాధారణ నేతగానే ఉండిపోయారు. పార్టీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలో లభించిన ప్రాధాన్యత బీజేపీలో దక్కడంలేదు. దీంతో ఆయన తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్దమయ్యారు. ప్రియాంక గాంధీతో భేటీ సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సోదరుడిని కాంగ్రెస్ లోకి తిరిగి తీసుకొస్తానని చెప్పారు.

Advertisement

తొందర్లోనే మరికొంతమంది బీజేపీ నేతలతో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే, ఆయన వచ్చే ఎన్నికల్లో మునుగోడు కాకుండా ఎల్బీ నగర్ సీట్ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన చాలామంది ఎల్బీ నగర్ లో ఉంటున్నారు. పైగా ఈ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తే తన గెలుపు ఈజీ అవుతుందని రాజగోపాల్ రెడ్డి తలంపుతో ఉన్నారు.

Advertisement

ఇదే నియోజకవర్గం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్ రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, దండెం రాంరెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. మల్ రెడ్డి , జక్కిడి ప్రభాకర్ రెడ్డిలు సీరియస్ గా ఎల్బీ నగర్ లో చాలా కాలంగా పని చేస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి కోరిక మేరకు ఎల్బీ నగర్ టికెట్ ఆయనకు కేటాయిస్తే మల్ రెడ్డి సోదరుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

దీంతో ఎల్బీ నగర్ టికెట్ పై కాంగ్రెస్ నుంచి హామీ లభించకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Advertisement