low investment highest profit business
Business : ఈరోజుల్లో చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సొంత వ్యాపారం చేయడానికి మన దేశంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని పొందే బిజినెస్ లు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది వివిధ రకాల మొక్కలను పెంచుతూ డబ్బులను సంపాదిస్తున్నారు. మొక్కలను పెంచడం ఇష్టం ఉన్నవారు ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. అలా మొక్కలపై ఆసక్తి ఉన్నవారు ఈ బిజినెస్ ని కనుక చేశారంటే మంచి లాభాలను పొందవచ్చు. ఈ బిజినెస్ కు పెద్దగా ఖర్చు కూడా ఉండదు. అయితే ఈ వ్యాపారం చేయడానికి ఓపిక అనేది చాలా అవసరం.
నాటిన చెట్లు ఎనిమిది నుంచి పది సంవత్సరాలు లో పెరుగుతాయి. మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందాలనుకుంటే ఈ వ్యాపారం మీకు బాగా నచ్చుతుంది. చెట్ల పెంపకంలో పెట్టుబడి పెట్టడం వలన రైతులకు లాభదాయకంగా ఉంటుంది. చెట్లు పెరగటానికి ఎక్కువ సమయం తీసుకున్న తర్వాత మంచి లాభాలను పొందుతారు. అయితే మార్కెట్లో ముఖ్యంగా ఈ నాలుగు చెట్లకు బాగా డిమాండ్ ఉంది. అవి ఏ మొక్కలో ఇప్పుడు తెలుసుకుందాం. మహోగని చెట్లు విలువైన చెట్లలో ఒకటి. ఈ చెట్టులో దాదాపు ప్రతిభాగం ఎంతో విలువైనది. అలాగే రైతులకు దీర్ఘకాలం ఆదాయాన్ని అందించే బిజినెస్ అని చెప్పవచ్చు. ఈ చెట్టును ఉపయోగించి ఓడలు, ఫర్నిచర్, ప్లైవుడ్, అలంకరణలు, శిల్పాలు తయారు చేస్తారు. అందుకే మార్కెట్లో ఈ చెట్టుకు బాగా గిరాకీ ఉంది.
ఈ చెట్టు పెరగటానికి ఎనిమిది పది సంవత్సరాలు సమయం పట్టిన తర్వాత మంచి ఆదాయం వస్తుంది. ఈ చెట్లు పెంచడానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. అలాగే టేకు చెట్ల పెంపకం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. టేకు కలపకు మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇది చాలా బలమైన కర్ర. టేకు చెట్లను కనుక సాగు చేస్తే మంచి లాభాన్ని పొందవచ్చు.అత్యంత ఖరీదైన చెట్లలో గంధపు చెట్లు ఒకటి. మార్కెట్లో వీటికి చాలా ధర పలుకుతుంది. గంధం చెక్కలు మార్కెట్లో కిలో 27 వేల రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. ఈ చెట్ల పెంపకం ద్వారా మంచి లాభాన్ని పొందవచ్చు. అలాగే రోడ్లపై వెళ్తున్నప్పుడు ఇరువైపులా ఎత్తైన పచ్చని చెట్లు కనిపిస్తాయి.
ఇందులో ఎక్కువగా నీలగిరి చెట్లే ఉంటాయి. అయితే చాలామంది ఇవి పనికిరాని చెట్లను అనుకుంటారు. కానీ వీటితో చాలా లాభాలు ఉన్నాయి. ఇవి ఆస్ట్రేలియా మూలానికి చెందిన చెట్లు. మన దేశంలో కూడా వీటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. నీలగిరి చెట్లను సాగు చేస్తే లక్షల్లో ఆదాయం వస్తుంది. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఈ నాలుగు చెట్లు పెంచుకోవడానికి ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఒకవేళ చెట్లను పెంచాలనుకుంటే వ్యవసాయ నిపుణులను సంప్రదించాలి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…