sara-tendulkar-act-in-ram-charan-movie
Sara Tendulkar – Ram Charan : బాలీవుడ్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి రాంచరణ్ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం లేని అమ్మాయిని పెడితే బాగుంటుందని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి జోడిగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పలుమార్లు సచిన్ టెండూల్కర్ రాజ్ కుమార్ హిరానీతో చర్చలు జరిపి తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చెప్పారట. ఇక సచిన్ వచ్చి స్వయంగా అడగడంతో మంచి కథ వచ్చినప్పుడు చెబుతాను అని డైరెక్టర్ మాట ఇచ్చారట. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా సారా టెండూల్కర్ ను పరిచయం చేయాలని రాజ్ కుమార్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో ఈ వార్త నిజం అవ్వాలని రామ్ చరణ్ అభిమానులతో పాటు సచిన్ టెండూల్కర్ అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత వెంటనే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తారని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే బుచ్చిబాబుతో సినిమా చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా సినిమా చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా సారా టెండూల్కర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింటా ట్రెండ్ అవుతూ ఉంటాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…