youth test hiv positive after they had tattoos in varanasi
Viral News : వాళ్లంతా 25 ఏళ్ల లోపు యువకులే. ఎవ్వరికీ పెళ్లి కాలేదు. ఎవరితోనూ లైంగిక సంబంధం పెట్టుకోలేదు. ఎలాంటి రక్తాన్ని కూడా ఎక్కించుకోలేదు. కానీ.. వాళ్లకు హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. ఎయిడ్స్ వచ్చింది. దీంతో వాళ్లతో పాటు డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. అసలు.. వాళ్లకు ఎయిడ్స్ ఎలా వచ్చిందో తెలుసుకొని అందరూ నోరెళ్లబెట్టారు.
ఈ ఘటన యూపీలోని వారణాసిలో చోటు చేసుకుంది. పీటీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఆసుపత్రిలో గత రెండు నెలల నుంచి నిర్వహించిన హెచ్ఐవీ పరీక్షల్లో వాళ్లకు పాజిటివ్ గా తేలింది. వాళ్లంతా 25 ఏళ్ల లోపు వారే కావడం, ఎవ్వరికీ పెళ్లి కాకపోవడం, అందులోనూ వాళ్లకు హెచ్ఐవీ సోకిన విధానం ఒకే రకంగా ఉండటంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు.
వీళ్లకు ఎయిడ్స్ రావడానికి కారణం టాటూ. అవును.. ఈ యువకులు అంతా పలు ప్రాంతాల్లో పలు జాతరలలో టాటూలు వేయించుకున్నారు. వారణాసికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువకుడు అక్కడ జరిగిన జాతరలో టాటూ వేయించుకున్నాడు. టాటూ వేయించుకున్న కొన్ని నెలల తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. జ్వరం తీవ్రం అయింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నాడు. ఎన్ని టెస్టులు చేసినా తన ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో హెచ్ఐవీ టెస్ట్ చేయగా పాజిటివ్ గా తేలింది. ఇది ఆ యువకుడికే కాదు.. అలా మరో 11 మంది యువకులకు ఇలాంటి లక్షణాలే వచ్చాయి. వాళ్లంతా టాటూలు వేయించుకున్నవాళ్లే.
టాటూలు వేయించుకుంటే హెచ్ఐవీ ఎలా సోకింది అనే కదా మీ డౌట్. చాలామంది టాటూ ఆర్టిస్టులు ఒకే సూదితో చాలామందికి టాటూలు వేస్తుంటారు. ఆ సూదికి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల.. ఒకరి నుంచి మరొకరికి హెచ్ఐవీ సోకింది. పచ్చబొట్టు కోసం వేసే సూది చాలా ఖరీదైనది కావడం వల్ల.. ఒక్క సూదితోనే వాళ్లు చాలామందికి టాటూలు వేస్తుంటారు. కానీ.. ఒకరికి ఉపయోగించిన సూదిని మరొకరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. బ్రాండెడ్ సూదినే ఉపయోగించాలి.. అది కూడా ఒకసారే ఉపయోగించాలి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…