Rohit Sharma Catch : ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ నాట్ ఔట్…ఇదేగో ప్రూఫ్…

Rohit Sharma Catch  : తాజాగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఇండియా ఓడిపోవడం అభిమానులకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. లీగ్ దశలో అద్భుతమైన ఆట తీరుతో ఈసారి కప్పు కచ్చితంగా మనదే అని అందరూ భావించారు. దీంతో ఫైనల్ మ్యాచ్లో కూడా రోహిత్ సేన ఏదో ఒక మ్యాజిక్ చేసి ప్రపంచ కప్ గెలుచుకుంటుందని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా భారీ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలోనే టీం ఇండియా ఓటమికి గల కారణాలు చర్చకు వస్తున్నాయి. అలాంటి అంశాలలో రోహిత్ క్యాచ్ అవుట్ కూడా ఒకటి. తొలిత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా పవర్ ప్లే లో దూసుకెళ్తున్న సమయంలో మ్యాక్స్వెల్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడెందుకు ప్రయత్నించిన హిట్ మాన్ రోహిత్ ట్రావిస్ హెడ్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు.

ఇక ఈ ఒక్క క్యాచ్ అవుట్ తో మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది. రోహిత్ ఔట్ అయిన తర్వాత పరుగులు చేసేందుకు భారత్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేక కేవలం 240 పరుగులకే కుప్పకూలిపోయింది.ఇక ఈ లక్ష్యాన్ని సునాయాసంగా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ కప్ గెలుచుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో రోహిత్ శర్మ క్యాచ్ ను ట్రావీష్ హెడ్ సరిగా అందుకోలేకపోయాడని…బంతి నేలకి తాకిందంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ తో సహా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. క్యాచ్ మిస్ చేసినప్పటికీ ఎంపైర్ రోహిత్ ను అవుట్ గా ప్రకటించారంటూ వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వాదనలకు తెరదించుతూ ఐసీసీ తాజాగా రియల్ ఫుటేజ్ ని విడుదల చేయడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుండి ఈ వీడియోని షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో గమనించినట్లయితే రోహిత్ శర్మ క్యాచ్ ను హెడ్ సరిగానే అందుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ వీడియో ద్వారా రుజువైంది. తాజాగా డీప్ ఫేక్ ఫోటోలు వీడియోలతో పాటు ఇలాంటి ఘటనల సమయంలో కూడా అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆకతాయిలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అయ్యే విషయాలను ఎవరు నమ్మొద్దని పలువురు సూచిస్తున్నారు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago