kannappa-first-look
Kannappa : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమాలలో కన్నప్ప సినిమా కూడా ఒకటి. టాలీవుడ్ హీరోలలో ఒకరైన మంచు విష్ణు ఈ సినిమాను నిర్వహిస్తున్నారు.అయితే విష్ణు కెరియర్ స్టార్టింగ్ నుండి ఏ సినిమా చేసిన ప్లాప్ అవుతూనే ఉంది. అయినప్పటికీ పట్టు వదలకుండా వరుసగా సినిమాలను చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా జిన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విష్ణు. కాగా ఇది కూడా ఫ్లాప్ అయింది.
ఇక ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న విష్ణు ఇప్పుడు కన్నప్ప అనే సినిమాను తీయబోతున్నాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా న్యూజిలాండ్ లోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుంది.అయితే ఇటీవల విష్ణు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పోస్టర్ లో విష్ణు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు. పోస్టర్ ను గమనించినట్లయితే ప్రకృతిలో మహా శివలింగం ముందు బాణం ఎక్కుపెట్టిన వారియర్ లాగా విష్ణు దర్శనమిస్తున్నాడు.
దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్ పై భారీ అంచనాలు పెరిగాయి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు మోహన్ బాబు 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మణిరత్నం స్టీఫెన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ , మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా విష్ణుకు ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…