Categories: NewsTechnology

Aditya-L1 :  ఆదిత్య L1 ప్రయోగానికి సర్వం సిద్ధం…..సూర్యునిపై అధ్యయనానికి కొత్త శ్రీకారం…

Aditya-L1 :  నిన్నటి వరకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రుని రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయోగించిన చంద్రయన్ 3 గురించి అందరూ మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో సిద్ధమైనది. ఒకవైపు చంద్రయాన్ 3 ను నిర్వహిస్తూనే సూర్యునిపై రహస్యాలు చేదించేందుకు ఆదిత్య L1 మిషన్ ను ఇస్రో సిద్ధం చేసింది. ఇక దీనిని రేపు ఉదయం 11.50 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఇస్రో ప్రయోగించబోతుంది. ఇది కూడా విజయవంతం అయితే భారత్ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ గౌరవాన్ని పొందే అవకాశం ఉంది.

సూర్యునిపై రహస్యాలను తెలుసుకునేందుకు గత కొన్ని దశాబ్దాలుగా చాలా దేశాలు సోలార్ మిషన్లను ప్రయోగిస్తున్నారు. వాటిలో కొన్ని మాత్రమే విజయవంతం అవ్వగా చాలా వరకు విఫలమయ్యాయి. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం చేదించని చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేదించి ఊపులో ఉన్న ఇస్రో…ఇప్పుడు సూర్యుడిపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దీనిని కూడా విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దేశాలకు భారత్ అంటే ఏంటో చూపించాలని పట్టుదలతో ఉంది. దీంతో రేపు ప్రయోగించబోయే ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ప్రపంచమంతా ఆసక్తికరంగా గమనిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ ఎన్నో మైలురాళ్లను చేదించినట్లే. మరి ముఖ్యంగా సూర్యునిపై అధ్యయనం చేస్తున్న అతి కొద్ది దేశాలలో భారత్ నిలుస్తుంది.

జపాన్ యూకే ,యూఎస్ ,యూరప్ అంతరిక్ష మద్దతులతో ప్రయోగించిన హినోడ్ నౌక భూమి చుట్టూ తిరుగుతుంది. ఇది సూర్యుని అయస్కాంత క్షేత్రాలను గమనిస్తూ కొలుస్తుంటుంది. అలాగే నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉమ్మడి ప్రాజెక్టు అయినా సోలార్ అండ్ ,హీలియో స్పిరిక్ అబ్జర్వేటరీ మిషన్ SOHO , ఆదిత్య L1 కోసం ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్న లాగ్రాజ్ పాయింట్ కు దగ్గర లోనే పరిభ్రమిస్తుంది. ఇవి దాదాపు సూర్యుని నుండి 42 మిలియన్ కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 విజయవంతం అయితే ఈ దేశాల సరసన భారత్ కూడా నిలుస్తుంది. అంతేకాక తక్కువ సమయంలో అందరికంటే మెరుగ్గా ప్రయోగం చేసి పలు రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం భారత్ దూకుడును ఇతర దేశాలు ఉత్కంఠంగా గమనిస్తున్నాయి.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago