Aditya-L1 : నిన్నటి వరకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రుని రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయోగించిన చంద్రయన్ 3 గురించి అందరూ మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో సిద్ధమైనది. ఒకవైపు చంద్రయాన్ 3 ను నిర్వహిస్తూనే సూర్యునిపై రహస్యాలు చేదించేందుకు ఆదిత్య L1 మిషన్ ను ఇస్రో సిద్ధం చేసింది. ఇక దీనిని రేపు ఉదయం 11.50 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఇస్రో ప్రయోగించబోతుంది. ఇది కూడా విజయవంతం అయితే భారత్ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ గౌరవాన్ని పొందే అవకాశం ఉంది.
సూర్యునిపై రహస్యాలను తెలుసుకునేందుకు గత కొన్ని దశాబ్దాలుగా చాలా దేశాలు సోలార్ మిషన్లను ప్రయోగిస్తున్నారు. వాటిలో కొన్ని మాత్రమే విజయవంతం అవ్వగా చాలా వరకు విఫలమయ్యాయి. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం చేదించని చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేదించి ఊపులో ఉన్న ఇస్రో…ఇప్పుడు సూర్యుడిపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దీనిని కూడా విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దేశాలకు భారత్ అంటే ఏంటో చూపించాలని పట్టుదలతో ఉంది. దీంతో రేపు ప్రయోగించబోయే ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ప్రపంచమంతా ఆసక్తికరంగా గమనిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ ఎన్నో మైలురాళ్లను చేదించినట్లే. మరి ముఖ్యంగా సూర్యునిపై అధ్యయనం చేస్తున్న అతి కొద్ది దేశాలలో భారత్ నిలుస్తుంది.
జపాన్ యూకే ,యూఎస్ ,యూరప్ అంతరిక్ష మద్దతులతో ప్రయోగించిన హినోడ్ నౌక భూమి చుట్టూ తిరుగుతుంది. ఇది సూర్యుని అయస్కాంత క్షేత్రాలను గమనిస్తూ కొలుస్తుంటుంది. అలాగే నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉమ్మడి ప్రాజెక్టు అయినా సోలార్ అండ్ ,హీలియో స్పిరిక్ అబ్జర్వేటరీ మిషన్ SOHO , ఆదిత్య L1 కోసం ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్న లాగ్రాజ్ పాయింట్ కు దగ్గర లోనే పరిభ్రమిస్తుంది. ఇవి దాదాపు సూర్యుని నుండి 42 మిలియన్ కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 విజయవంతం అయితే ఈ దేశాల సరసన భారత్ కూడా నిలుస్తుంది. అంతేకాక తక్కువ సమయంలో అందరికంటే మెరుగ్గా ప్రయోగం చేసి పలు రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం భారత్ దూకుడును ఇతర దేశాలు ఉత్కంఠంగా గమనిస్తున్నాయి.