woman taking selfie in flash flood video viral
Viral Video : ఇదివరకు ఫోటోలు తీయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే అప్పుడు కెమెరాలే ఉండేవి. స్మార్ట్ ఫోన్లు గట్రా లేవు. కానీ.. ఇప్పుడు ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్లే. అందుకే.. సెల్ఫీలు, వీడియోలు, ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైకులు, కామెంట్లు కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు కొందరు. కొందరైతే ఏ పని చేసినా.. ఎక్కడికెళ్లినా సెల్ఫీలు తీయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. లైక్ లు, కామెంట్ల కోసం డేంజర్ జోన్లలోనూ సెల్ఫీలు తీసుకోవడం చూశాం. కొందరు సెల్ఫీ మోజులో పడి ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు.
తాజాగా ఈ వీడియో చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఓవైపు భారీగా వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతుంటే.. ఓ మహిళ మాత్రం సెల్ఫీ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. భారీగా వరద దూసుకొస్తోంది. సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఆ వరదలోనే నిలబడి అలాగే సెల్ఫీ తీసుకుంది ఆ మహిళ.
ఈ వీడియో ఇండోనేషియాకు చెందినదిగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇది ఇప్పటిది కాదని.. చాలా రోజుల నాటిది అని చెబుతున్నప్పటికీ.. ఈ వీడియోలో ఉన్న మహిళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరద ముంచెత్తుతున్నా.. తను వరదలో కొట్టుకుపోతున్నా సెల్ఫీ స్టిక్ ను మాత్రం వదల్లేదు. అలాగే.. వీడియో తీస్తూ ఉంది.
పాతది అయినప్పటికీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి.. ఎందుకు తల్లీ నీకు అంత బాధ. ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు. సెల్ఫీ కోసం అంత రిస్క్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…