Shocking news that jr NTR has changed the director of the movie 30
NTR 30 : ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా సక్సెస్ తర్వాత కొరటాల శివ తో తన నెక్స్ట్ మూవీ ని చేయబోతున్నాడని మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లు పోయిన సంవత్సరం ప్రకటన ఇచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాకు కొరటాల దర్శకత్వం వహించకపోవచ్చు అని సందేహాలు వస్తున్నాయి. సినీ పరిశ్రమలో కూడా ఈ విషయంపై చర్చ జరుగుతుంది. ‘ ఆచార్య ‘ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో కొరటాల శివతో సినిమా అంటే కాస్త ఇబ్బంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ కూడా కొరటాలతో సినిమా చేయడానికి కాస్త వెనకడుగు వేశాడని వార్తలు కూడా వస్తున్నాయి.
ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ తో కాకుండా ఎవరితో సినిమా చేస్తాడో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కనిపిస్తున్నాడు. పోయిన సంవత్సరం ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుచ్చిబాబు ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం నుండి బుచ్చిబాబు ఎన్టీఆర్ డేట్ ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కన్ఫర్మ్ అయింది. కానీ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఓ సినిమా చేయాల్సి రావడంతో బుచ్చిబాబు వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ వద్ద సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో ఎన్టీఆర్ బుచ్చిబాబు వైపు అడుగులు వేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యేలా ఉన్నాయి.
బుచ్చిబాబు ఇటీవల తన గురువు అయిన సుకుమార్ తో కలిసి ఎన్టీఆర్ కోసం స్క్రిప్టును సిద్ధం చేశాడట. అతి త్వరలోనే ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కు వినిపించి ఓకే చెప్పించి వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఒకవేళ అదే జరిగితే ఎన్టీఆర్ 31వ సినిమా డైరెక్టర్ ప్రశాంత నీల్ తో చేయబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ 32వ సినిమా కొరటాల దర్శకత్వం వహిస్తాడేమో చూడాలి. ఇప్పటికే ఫ్రీ లుక్ రిలీజ్ చేయడం వల్ల ఎన్టీఆర్ మాట తప్పుతాడా అనేది కూడా చర్చకు తెర తీస్తుంది. మరి ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాలి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…