Categories: healthNews

Nuvvulu Benefits : రోజు నువ్వులను తింటున్నారా..? అయితే ఏం జరుగుతుందో తెలుసా..?

Nuvvulu Benefits : ఎన్నో రోజుల నుండి భారతీయులు నువ్వులను వంట ఇంట్లో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా నువ్వులు నూనెతో వివిధ రకాల వంటలు చేసి కుటుంబాన్ని ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతున్నారు. అలాగే నువ్వులను వివిధ రకాల సంప్రదాయాల ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ నవ్వుల్లో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో నువ్వులు ప్రథమ స్థానంలో ఉన్నవి. ఈ క్రమంలో రోజు నువ్వులు ఒక గుప్పెడు తింటే మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజు గుప్పెడు నువ్వులు తినడం వల్ల 3.5 గ్రాముల ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగుపడి జీర్ణానికి సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి. అలాగే గుండె జబ్బులు ,వివిధ రకాల క్యాన్సర్లు ,డయాబెటిస్ బీపీ వంటి సమస్యలు చుట్టుముట్టకుండా కాపాడుతాయి. నువ్వుల్లో మన శరీరానికి అవసరమయ్యే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్లైవనాయిడ్స్, ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, ఫైటో న్యూట్రియంట్లు అధికంగా ఉండి ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత సమస్యలను దూరం చేస్తాయి.

Nuvvulu Benefits : రోజు నువ్వులను తింటున్నారా..? అయితే ఏం జరుగుతుందో తెలుసా..?

Health benefits of nuvvulu

నవ్వుల్లో ఆమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. డైట్ పాటించే వారికి ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. నువ్వులను రోజు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు వెల్లడించారు. నువ్వులు మన శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించి, మంచి కొలెస్ట్రాలను ఏర్పరుస్తాయి. ధ మనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా యాంటీ ఆక్సిడెంట్లు, ఆంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు పనితీరుని మెరుగు పరుస్తాయి. తద్వారా వీటి వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు చేకూరుతాయి. నువ్వుల్లో ఉండే మెగ్నీషియం వ్యాధిని నియంతరిస్తుంది. హై బీపీ సమస్యతో బాధపడేవారు నిత్యం గుప్పెడు నువ్వులు తినడం చాలా మంచిది. బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా బాగా జరుగుతుంది.

అలాగే నువ్వుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే నువ్వుల నూనె రాసుకుంటే ఎటువంటి నొప్పులు అయినా మటుమాయమవుతాయి. అయితే నువ్వులు తిన్నా కూడా నొప్పులను ఈజీగా తగ్గించుకోవచ్చు. నువ్వుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు నొప్పులను దూరం చేస్తాయి. ఇక నువ్వులను తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్లు బి1,బి3 బి6 లు పుష్కలంగా లభిస్తాయి. నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు రోజు నువ్వులు తినడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.

అలాగే డయాబెటిస్ ఉన్నవారు నువ్వులు తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. నువ్వులు పట్టి రోజుకు ఒకటి తినడం వల్ల మన శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి లభిస్తుంది. నువ్వుల్లో ఉండే జింక్ చర్మాన్ని కాపాడే కోల్లాజిన్ ఉత్పత్తికి సాయపడి చర్మం అందంగా ఆరోగ్యంగా మెరిసేలా తయారవుతుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, ముడతలు రాకుండా కాపాడుతుంది. అయితే నువ్వులు పచ్చివి గా తీసుకునే కన్నా దోరగా వేయించి బెల్లం కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago