police chased thieves in punjab video viral
Viral Video : సినిమాల్లో దొంగలను పోలీసులు ఛేజ్ చేసే సీన్స్ ఎన్నో చూసి ఉంటాం. అవన్నీ రియల్ గా జరుగుతాయా… అదంతా సినిమాల్లోనే కదా అని అనుకుంటాం. కానీ.. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే నిజంగా ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అని ముక్కున వేలేసుకుంటారు. మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. అవును.. అచ్చం సినిమాలో జరిగినట్టుగానే పోలీసులు.. కొందరు దుండగులను కారులో ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో చోటు చేసుకుంది. అసలే ఇరుకు రోడ్డు. వేగంగా వెళ్తున్న ఓ కారును పోలీసు వాహనం వెంబడిస్తోంది. అక్కడ ఉన్న స్థానికులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఆ కారు వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న వాళ్లను ఢీకొడుతూ వెళ్తోంది. వెంటనే పోలీసులు ముందు వెళ్తున్న కారు టైర్లపై కాల్పులు జరిపారు. అయినా కారు ఆగలేదు. దీంతో కారు దిగిన ఓ పోలీసు ఆ కారును వెంబడించి చివరకు ఆ కారులోని దుండగులను పట్టుకున్నాడు.
మారుతి సుజుకి కారులో ఇద్దరు దుండగులు హెరాయిన్ అనే డ్రగ్ ను తీసుకెళ్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆ కారును వెంబడిస్తున్న సమయంలోనే ఈ ఛేజ్ చోటు చేసుకుంది. చివరకు కారును ఆపి దుండగులను పట్టుకొని పోలీసులు కారులోని హెరాయిన్ ను సీజ్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏమాత్రం భయపడకుండా పరిగెత్తి డేర్ చేసి ఆ దొంగలను పట్టుకున్న పోలీస్ ధైర్యసాహసాలను స్థానికులు మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఆ పోలీసును మెచ్చుకుంటున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…