షుగర్ ఉన్నవాళ్ళు మందులు వాడుతుంటారు. ఈ ‘మందుల’తో పాటు ‘మందు’ కొడితే ఏమౌతుంది అనే గొప్ప సందేహం మన మందు ప్రేమికులకు కలుగుతుంది. దానిని జవాబు ఒక్కటే. మద్యం తాగకూడదు. ఇందులో ఎటువంటి మినహాయింపులు లేవు. మద్యం తాగాక మందులు వేసుకోవచ్చా? అన్న ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. అది కూడా మంచిది కాదు. ఒక్కసారి షుగర్ బయటపడిన వాళ్ళు జీవితాంతం మందులు మాదలి, జీవితాంతం మందుకు దూరంగా ఉండడం మేలు. షుగరుకు మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని, మద్యంతో నాడులు దెబ్బతింటాయని అని గుర్తు పెట్టుకోవాలి.
మామూలుగానే మధుమేహులకు సున్నితమైన నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువకాలం నుంచి షుగరుతో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లెక్కడం, మంట పెట్టటం, సూదులు పొడిచినట్టు అనిపించటం వంటి వాటితో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు షుగరు తోడైతే వ్యాధులన్నీ తీవ్రతరమవుతాయి. కాళ్లు మొద్దుబారడం, పుండ్లు పడటం, పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావడం జరుగుతుంటుంది. ఒక గాయం అయితే అంత తొందరగా మానదు.
ఎప్పుడైనా మద్యం తాగాల్సి వస్తే ముందు భోజనం చేసి మాత్రలు వేసుకోవాలి. మద్యం ఒకటి, రెండు పెగ్గులు పరవాలేదు. కానీ తూలిపడెంత తాగితేనే ప్రమాదం. తర్వాత భోజనం చేయకపోతే మందులు వేసుకోకూడదు. అది మరీ ప్రమాదం. కాలేయం నిరంతరం గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తూ రక్తంలో గ్లూకోజు మొతాదులు స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఈ ప్రక్రియను మద్యంలోని ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరానికి తగినంత గ్లూకోజు ఉత్పట్టి కాదు. ఫలితంగా గ్లూకోజు మోతాదులు పడిపోతాయి.
యాంటీ బయోటిక్స్, నొప్పిని తగ్గించే మందులవంటివి జీర్ణాశయ పూత సమస్యకు దారితీస్తాయి. మద్యం కూడా ఈ సమస్యను తెచ్చిపెడుతుంది. మందులు, మద్యం రెండూ కలిస్తే సమస్య ఇంకా ఎక్కువవుతుందేకానీ తగ్గదు. కొందరికి వాంతులు, ఛాతీలో మంట వస్తాయి. మరికొందరికి రక్తపు వాంతులు వస్తాయి. మందులు వేసుకునేటప్పుడు మద్యం జోలికి వెళ్లకపోవడం చాలా మంచిది.
Also Read : డయాబెటిస్ శాశ్వతంగా తగ్గాలంటే 5 ఉత్తమ మార్గాలు?
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…