doctor suggest to drink amla juice regular for good health
Amla juice : ఉసిరి మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కాయలు ఔషధ గుణాలు లతో పాటు విటమిన్ సి ఎక్కువగానే ఉంటుంది. ఆపిల్ కంటే ఉసిరిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వివిధ రకాల పండ్లతో పోలిస్తే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఎంబ్లి కానీ న్ _A,B ఐరన్ ,ఫాస్ఫరస్ ,పొటాషియం, ఎలాజిక్ , గాలి కామ్లం.. వంటి ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. చాలామంది దీన్ని పొడిగా ,తేనె కలుపుకొని పరిగడుపున తీసుకుంటారు.
మరి కొందరు పచ్చడిగా తినడానికి ఇష్టపడతారు. మరికొందరు ఉసిరి రసాన్ని తాగుతుంటారు. ప్రతిరోజు ఒక గ్లాసు ఉసిరి జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ తరచుగా తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ లో ఉండి, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. ఉసిరి యాసిడిటీ, కడుపుబ్బరం, అలసట, చర్మం నిగారింపుగా ఉండడం, స్త్రీలలో నెలసరి సమస్యలు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలు వంటివి దూరం చేస్తుంది. ఉ సిరి జీర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది.
ఈ కాయ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియ వ్యవస్థను దృఢంగా మారుస్తుంది. ఇందులో పీచు పదార్థం ఆకలని తగ్గిస్తుంది. దీంతో ఊబకాయాన్ని అడ్డుకోవచ్చు. ఉసిరి జ్యూస్ రోజు తాగితే రోగనిరోధక శక్తి పెరిగి వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, జలుబు ,దగ్గు వంటి సమస్యలకు దూరంగా ఉంచుతుంది. అలాగే అధిక బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
కంటి సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో ఉండే క్రోమియం ఇన్సులిన్ స్రావాన్ని పెంచడం ద్వారా షుగర్ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది. ఉసిరిలో వివిధ రుచులు ఉంటాయి. ఉసిరిలో పులుపు మినహా ఐదు రుచులు ఉంటాయి. దీనిలో ఉండే తీపి ,వగరు ,శరీరంలో వేడిని తగ్గిస్తుంది ఉసిరిని రెండురకాలుగా తీసుకోవచ్చు. జ్యూస్ రూపంలో ,పొడి గా తీసుకోవచ్చు. మీ చర్మం కళ్ళు జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్న, రోగ నిరోధక శక్తి పెరగాలన్న ప్రతిరోజు ఉసిరి రసం తాగడం మంచిది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…