Kerala Kid : నాలుగేళ్ల పిల్లోడు అంటే ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. నచ్చింది ఇవ్వకపోతే మారం చేస్తూ ఉంటాడు. కానీ ఈ కేరళకు చెందిన నాలుగేళ్ల బుడ్డోడు మాత్రం ఏకంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను నడుపుతున్నాడు. అంతేకాదు యమహా RX 100 వంటి బైక్లను కూడా అవలీలగా నడిపిస్తున్నాడు. దీంతో ఈ చిన్నారి బైక్ డ్రైవింగ్ నైపుణ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం బైక్ మాత్రమే కాదు ఈ బుడ్డోడు టాటా ట్రక్ ను కూడా నడుపుతాడట. అయితే ఇవన్నీ ఆ పిల్లాడి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో పలు జాగ్రత్తలతో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అన్నిటికంటే కూడా ఈ బుడ్డోడు బుల్లెట్ బండిని నడపడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కనీసం గేర్ వేయడానికి కూడా కాలు అందని ఈ బుడ్డోడు అవలీలగా బుల్లెట్ బండిని నడిపిస్తున్నాడు. దీంతో ఈ వీడియో చూసిన నేటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ టాలెంటెడ్, బ్రిలియంట్ ,హ్యాట్సాఫ్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ బాలుడు బైక్ రైడింగ్ చేసే సమయంలో తన తండ్రి వెనకాలే ఉండి ఆ బాలుని అనుసరిస్తున్నట్లుగా మనం వీడియోలో గమనించవచ్చు. తన తండ్రి తనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో బుడ్డోడు అవలీలగా ఆ బండిని తోలుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో లక్షల వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇక ఈ చిన్నారి అసాధారణ ప్రతిభను చూసిన నేటిజనులు పశంసలు కురిపించక మానడం లేదు. అదేవిధంగా పలు జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు.
View this post on Instagram