Nandamuri Chaitanya krishna : మనలో మనకి గొడవలు ఎందుకు బిడ్డ…స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న నందమూరి జయకృష్ణ…

Nandamuri Chaitanya krishna : తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్, రామ్ తారకరత్న, చైతన్య కృష్ణ వంటి వారు హీరోలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నందమూరి జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ తాజాగా బ్రీత్ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నారు. బసవతారకం ఎన్టీఆర్ బ్యానర్ పై ఈ సినిమాను స్వయంగా ఆయనే నిర్మించడం విశేషం. అయితే ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం రోజు రాత్రి హైదరాబాదులో నిర్వహించడం జరిగింది.

Advertisement

అయితే ఈవెంట్ కు నందమూరి ఫ్యామిలీ నుండి మోహనకృష్ణ , జయకృష్ణ ,రామకృష్ణ ,లోకేశ్వరి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈవెంట్ లో భాగంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ బసవతారకం ఆశీస్సులతో ఈ బ్యానర్ ను నిర్మించామని మంచి కథ లభించినప్పుడు సినిమా చేయాలి అనుకున్నామని తెలియజేశారు. ఈ క్రమంలోనే బ్రీత్ అనే సినిమా ద్వారా కృష్ణ చైతన్యను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే కృష్ణ చైతన్యకు మొదటి నుండే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి ఉందని ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకున్నారు.

Advertisement

మా నందమూరి కుటుంబం నుండి వచ్చిన ఆర్టిస్టులు అందరిలాగానే కృష్ణ చైతన్య కూడా సినీ ఇండస్ట్రీలో నిలబడాలని నందమూరి వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలంటూ ఆశీర్వదించారు. ఇక హీరో కృష్ణ చైతన్య మాట్లాడుతూ…తన సొంత బ్యానర్ పై మంచి మెసేజ్ ఉన్న సినిమా తీయాలని ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నా. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బసవతారం పేరుతో బ్యానర్ కూడా ఏర్పాటు చేశాం. మంచి కథ దొరికినప్పుడు సినిమా చేయాలని నాన్న జయకృష్ణ కూడా నన్ను ప్రోత్సహించారు. ఇక ఈ సినిమాను కుటుంబ సంబంధాల ఆధారంగా తీసినట్లు తెలియజేశారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చైతన్యకృష్ణ చెప్పుకొచ్చారు.

Advertisement