Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. అధికార పార్టీ టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ బిజెపిల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. అయితే తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రసవత్తరమైన పోటీ జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఏడుగురు ఎంపీలు ,104 మంది ఎమ్మెల్యేలు , ఐదుగురు ఎమ్మెల్సీలు పోటీ చేయడం విశేషం. ఇక ఎన్నికలలో అతిరథ మహారధు లతో పాటు తొలిసారి రాజకీయ అరంగేట్రం చేస్తున్నవారు కూడా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ,118 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ, పొత్తు లో భాగంగా ఒకచోట సిపిఐ , అలాగే 111 స్థానాలలో బిజెపి , అలాగే పొత్తులో భాగంగా 8 స్థానలలో జనసేన , 19 నియోజకవర్గాలలో సిపిఎం పోటీ చేస్తున్నాయి. అయితే మొత్తం 119 నియోజకవర్గాలలో దాదాపు 2290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా …దీనిలో భాగంగా ఎంపీలకు సంబంధించి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఇక బిజెపి విషయానికి వస్తే బండి సంజయ్ , సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీ నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఇక ఎమ్మెల్సీ స్థానాలలో టిఆర్ఎస్ తరఫున కౌశిక్ రెడ్డి రాజేశ్వర్రెడ్డి ,కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి ,కసిరెడ్డి ,నారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ఎన్నికల ద్వారా 30 మంది కీలక నేతలు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈరోజు పోలింగ్ ముగిసిన అనంతరం డిసెంబర్ 3న ఫలితాలు వెళ్లడవుతాయి.