Health Tips : అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి…

Health Tips  : ప్రస్తుత కాలంలో చాలామంది పురుషులు ఎదుర్కునే అతిపెద్ద సమస్య అంగస్తంభన. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీని కారణంగా తమ భాగస్వామితో పురుషులు తనివి తీర చర్యలో పాల్గొనలేక పోతున్నారు. ఒకవేళ అంగం గట్టిపడిన అది ఎక్కువసేపు నిలవదు. ఇక ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సమస్య ఏంటో తెలుసుకోవాలి…

అంగస్తంభన సమస్యకు అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే ఈ సమస్య వచ్చిన వారు ముందుగా దానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే చాలామందిలో హార్మోన్స్ సమస్య ఉండటం వలన అంగస్తంభన ఏర్పడుతుంది. అలాగే టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్న… ప్రోల్యాక్టిన్ ఎక్కువగా ఉన్న ఈ సమస్య ఏర్పడే అవకాశాలుంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి కూడా అంగస్తంభన సమస్య తలెత్తవచ్చు. అలాగే తగినంత నిద్ర లేకపోవడం , ఆందోళనలగా ఉండడం, సరేనా పోషక ఆహారాన్ని తీసుకోకపోవడం వలన కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. అందుకే ముందు అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని తర్వాత దానికి తగిన నివారణ చర్యలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి…

అంగస్తంభనకు ప్రధాన కారణం హార్మోన్ల సమస్య అయినప్పటికీ కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుచ్చకాయ..సీజనల్ ఫ్రూట్ అయిన ఈ పుచ్చకాయ అంగస్తంభన సమస్య నుండి కాపాడేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలకూర, పప్పు ఆకుకూరలు ,అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్లు తినడం , కాఫీ తాగడం వంటివి చేస్తూ ఉండాలి. అదే విధంగా ఆరెంజ్ , బ్లూ బెర్రీ వంటి పండ్లను తీసుకోవడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.