Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు జరగకుండా మేనేజ్ చేస్తూ వచ్చే సుమ ఈమధ్య కాస్త తడబడుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంటర్వ్ లకు వెళుతూ కాస్ట్ అండ్ క్రూ ఎవరో తెలుసుకోకుండా సుమా వెళ్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటిన సైడ్ బి ఇంటర్వ్యూలో సుమాకు ఎదురు దెబ్బ కూడా తగిలింది.

Advertisement

ఇక ఇంటర్వ్యూలో రక్షిత్ శెట్టి గురించి సినిమా గురించి తెలుసుకోకుండానే ప్రశ్నలు వేసి తెల్ల మొహం వేసింది. అయితే తాజాగా యానిమల్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమా హోస్టుగా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమంలో ఒకచోట సుమా తప్పు చేసింది. రష్మిక మందన స్పీచ్ ముగిసిన తర్వాత ఆమెతో పాట పాడించాలని ప్రయత్నం చేసింది. ఇక ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మహేష్ బాబు రావడంతో రష్మిక, మహేష్ బాబు కలిసిన నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు నుండి ఈజ్ సో క్యూట్ అనే పాట పాడించే ప్రయత్నం చేసింది.

Advertisement

ఈ క్రమంలోని సుమా మాట్లాడుతూ మహేష్ బాబు రష్మిక మందన కలిసి ఒక సినిమా చేశారని , ఆ సినిమాలో మంచి పాట ఒకటి ఉందంటూ సర్కారు వారి పాట అనే సినిమా నుండి పాట పాడాలని చెప్పుకొచ్చింది. అయితే కన్ఫ్యూజన్లో అలా అనిందా…?లేక తెలియకుండా అన్నదా? అర్థం కాక రష్మిక సైలెంట్ గా ఉండిపోయింది. అయితే రష్మిక కి సైతం సినిమా పేరు గుర్తు లేదంటూ నేటిజనులు ట్రోల్ చేస్తున్నారు. సుమకి మహేష్ బాబు సినిమా పేరు కూడా గుర్తు లేదా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement