Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పలు రకాల షోలకు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ చాలా బిజీ బిజీగా గడుపుతుంది. అంతేకాక తెలుగు ఇండస్ట్రీలో టాప్ ఫైవ్ ఫిమేల్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ ముద్దుగుమ్మకు అభిమానులు కూడా ఎక్కువే. ఇక ఈమె చలాకీ మాటలతో బుల్లితెర రాములమ్మగా పేరు కూడా సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ రాములమ్మ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

Advertisement

sreemukhi-have-many-heart-break-love-stories

Advertisement

ఎ ఈవెంట్ లో చూసిన ఏ షోలో చూసిన శ్రీముఖి కనిపిస్తుంది. అయితే యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ఖాళీ సమయాలలో అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే మూడు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడపడం విశేషం. ఈ క్రమంలోనే పెళ్లి గురించి ప్రస్తావించిన ప్రతిసారి శ్రీముఖి ఆ ప్రశ్నను దాటేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి తన ఫ్యాన్స్ తో ఇంస్టాగ్రామ్ వేదికగా ముచ్చటించడం జరిగింది.

sreemukhi-have-many-heart-break-love-stories

ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇక దీనిలో భాగంగా ఒక సీక్రెట్ ని శ్రీముఖి బయట పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ప్రస్తావించని తన లవ్ సీక్రెట్ ని అభిమానులకు తెలియజేసింది. అయితే ఓ అభిమాని మీరెప్పుడైనా లవ్ లో ఫెయిల్ అయ్యారా అని అడగగా…దానికి శ్రీముఖి బొచ్చెడు సార్లు అంటూ సమాధానం ఇచ్చింది. హార్ట్ బ్రేక్ అయ్యే ప్రేమ కథలు చాలానే ఉన్నాయనే విషయాన్ని తెలియజేసింది. అలాగే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నలు కూడా ఎదురవడంతో వాటికి సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంది శ్రీముఖి. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement