Black pepper : నల్ల మిరియాలతో కూడా బరువు తగ్గవచ్చు.

Black pepper : నల్ల మిరియాల లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో నల్ల మిరియాల దినుసులుగా ఉపయోగిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. ఆహారం కొంచెం ఘాటుగా తినాలనుకునేవారు కారం బదులుగా మిరియాలను వాడవచ్చు. వీటిలో విటమిన్ సి సోడియం ,విటమిన్ ఏ ,విటమిన్ కె ,పొటాషియం తో పాటు ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య ప్రయోజనాలకు చెక్ పెట్టవచ్చు. అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

మన శరీరంలో ఉన్నా చెడు కొలెస్ట్రాలను పెరగకుండా చేయడంలో నల్ల మిరియాలు శక్తివంతంగా పనిచేస్తాయి. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. నల్ల మిరియాల లో ఉండే ఫైబర్ వల్ల ఆకలిది మందగిస్తుంది. అందువల్ల అధిక బరువు తగ్గాలనుకునేవారు నల్ల మిరియాల టీ తాగడం వల్ల ఈజీగా శరీర బరువు పెరగకుండా చూసుకోవచ్చు.

Black pepper : నల్ల మిరియాలతో కూడా బరువు తగ్గవచ్చు.

weight loss with black pepper
weight loss with black pepper

కీళ్ల నొప్పులు తగ్గించడంలో నల్ల మిరియాలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మిరియాల్లో ఉండే పెప్పరిన్ అనే సమ్మేళనం… రైనీ సీజన్లో వచ్చే దగ్గు ,జలుబు ,జ్వరం వంటి వ్యాధులను తగ్గిస్తుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ప్రమాదంగా మారే ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే ప్రమాదాన్ని అరికడతాయి. రోజు ఉదయాన్నే తమలపాకులతో పాటు నల్లమిరియాలని కలిపి తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

గోరువెచ్చని నీటిలో నల్ల మిరియాల పౌడర్ ఒక స్పూన్, నిమ్మరసం, తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది. అల్లం, తులసి ఆకులు, నల్ల మిరియాలు పౌడర్ వాటర్ లో వేసి బాగా మరిగిన తర్వాత రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. నల్ల మిరియాలతో కషాయాన్ని తయారుచేసి తరచుగా ఉదయాన్నే ఈ కషాయాన్ని రెండు ,మూడు స్పూన్లు తీసుకోవడం వల్ల వాతావరణం లో మార్పులు ఏర్పడడం వల్ల బ్యాక్టీరియా ,వైరస్లు నుండి వచ్చే ఇన్ఫెక్షన్ బారిన పడకుండ రక్షిస్తాయి.