Liger : తెలుగులో అతి తక్కువ మంది తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలా పేరు తెలుసుకుని వాళ్ళు ఒకరు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు అనే చిన్న సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో లైగర్ సినిమా తీసి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అయితే విజయ్ దేవరకొండ విజయాలతో పాటు ఎన్నో పరాజేయాలను కూడా అందుకున్నాడు. ఈ విధంగా కష్టపడుతూ కెరియర్లో మంచి స్థానానికి వచ్చాడు.
టాలీవుడ్ లో చాలా చిత్రాలతో తనదైన శైలిలో తన పర్ఫామెన్స్ తో మెప్పించి ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో కలిసి లైగర్ సినిమాలో డైనమిక్ క్యారెక్టర్ తో ప్రేక్షకల ముందుకు వస్తున్నారు. చార్మి మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ చేయడం జరిగింది. ఆగస్ట్ నెలలో 25వ తారీఖున ఈ సినిమా దేశం మొత్తం రిలీజ్ కావడం జరుగుతుంది. అయితే విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ మూవీ అమ్మానాన్న తమిళ అమ్మాయి అని సినిమా ఆధారంగా వచ్చేయన్న వార్తలు సోషల్ మీడియాలో ఊపొందుకున్నాయి.
Liger : లైగర్ ఆ సినిమాకి కాపీయా ట్రైలర్ తర్వాత డౌట్స్…ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారుగా…

అయితే దీనికి తావిస్తూ ట్రైలర్ లో ఉన్న సన్నివేశాలు కూడా ఆ సినిమాను పోలి ఉండడంతో ఈ సందేహానికి ఇంకా బలం చేకూర్చినట్టు అయింది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఈ రెండు సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేదని, ఈ రెండు కథల్లో చాలా వ్యత్యాసం ఉంటుందని చిత్ర యూనిట్ క్లియర్ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం రవితేజ నటించిన అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమా కంటే డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు స్పష్టం చేయడం జరిగింది.