Health benefits : దొండకాయ ఎండాకాలం మినహా అన్ని కాలాలు విరివిరిగా లభిస్తుంది. ఇది చూడటానికి పొట్టిగా ఆకుపచ్చగా ఉన్న దీనిలో ఉన్న పోషకాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. దొండకాయని కూరగా,పచ్చడగా గాని ఫ్రై లాగా రకరకాలుగా చేసుకోవచ్చు. దొండకాయలు బీటా కెరోటిన్, ప్రోటీన్లు ,విటమిన్లు ,ఖనిజాలు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ కాయ మధుమేహం ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది.
అంతేకాకుండా రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ కాయలో ఉండే విటమిన్ బి ఎలర్జీస్ వంటి వ్యాధులకు బారిన పడకుండా చేస్తుంది. దొండకాయను ఎక్కువగా తింటే బుద్ధి మందగిస్తుందని చాలామంది అంటూ ఉంటారు. కాని ఇది ఒక అపోహ మాత్రమే. మతిమరుపును తగ్గించడంలో ఈ కాయ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వంశపారం పరంగా వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. ఈ కాయలు రీబో ప్లేవిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనసుకు హాయిని కలిగించి డిప్రెషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
Health benefits : దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.

దొండకాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి దీనివల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు దగ్గు వంటి వ్యాధులకు గురికాకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే క్యాల్షియం మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.అధిక బరువు తగ్గాలనుకునేవారు ఈ కాయను డైట్ లో భాగంగా చేర్చుకోవచ్చు. బాడీలో ఐరన్ శాతం తక్కువగా ఉన్నట్లయితే అలసట, నీరసం అనీమీయ వంటి వ్యాధులు వస్తాయి.
ఇటువంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజు ఆహారంలో దొండకాయ తప్పనిసరిగా తీసుకోవాలి. దొండకాయలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్త సరఫరా బాగా జరిగి రక్తపోటును నియంత్రిస్తుంది. దొండకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. దొండకాయను అధికంగా తినడం వల్ల కొందరికి ఎలర్జీస్ వంటివి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమస్య ఉన్నవారు వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి.