Nithya Menon : ‘ అలా మొదలైంది ‘ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది నిత్యామీనన్. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. నితిన్ తో కలిసి ‘ ఇష్క్’ సినిమాలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన ‘ బీమ్లా నాయక్ ‘ సినిమాలో పవన్ కళ్యాణ్ తో జోడి కట్టింది. అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా నిత్యమీనన్ హాట్ టాపిక్ గా మారింది. ఓ స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందని, అతనిని పెళ్లి చేసుకుంటుందని బలమైన కథనాలే తెరపైకి వచ్చాయి.
అయితే తాజాగా వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు నిత్యామీనన్ రంగంలోకి దిగింది. ఎవరో పని కట్టుకొని అల్లిన కట్టు కథనాలవి. వాటిని మరికొందరు ఎలాంటి ఆధారం లేకుండా పబ్లిష్ చేస్తారు. అలాంటివి ఏమైనా ఉంటే నన్ను సంప్రదిస్తే నేనే స్వయంగా వివరణ ఇచ్చేదాన్ని. ప్రస్తుతం నేను ఎవరి లవ్ లో లేను, ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు. నేనే ఏడాదికాలంగా సినిమాలు, వివిధ టీవీ షో లతో బిజీగా ఉన్నాను. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈ గ్యాప్ లో నేను ఎవరితోనో ప్రేమలో ఉన్నానని, విదేశాలు చెక్కేస్తున్నానని ఇష్టానుసారం కథనాలు అల్లేసారు. అవన్నీ ఫేక్ వార్తలు అని చెప్పుకొచ్చింది నిత్యమీనన్.
Nithya Menon : నేను రెస్ట్ లో ఉంటే… ఇంతలా కథ అల్లేస్తారా… అని సీరియస్ అయినా నిత్యామీనన్…

ఎంత నటినైనా నేను మనిషినే, ప్రతిసారి అందరికీ కనిపించాలి అని లేదు. నిరంతరం సినిమాల్లో పనిచేయటానికి నేను రోబోను కాదు. ఇప్పుడు నా చీలమండకి గాయమైంది. దీనివలన కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నాను అని అసలు విషయాన్ని బయటపెట్టింది నిత్యామీనన్. అలాగే లవ్, డేటింగ్ వంటి టాపిక్స్ లో నిత్యామీనన్ పేరు తెరపైకి వస్తే వెంటనే స్పందిస్తుంది. అలాగే గతంలో ఇలాంటివి వచ్చినప్పుడు నిత్యమీనన్ వెంటనే ఖండించారు.