Zodiac Signs : ఆగస్టు నెలలో 2022లో వృశ్చిక రాశి వారికి గ్రహస్తి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషరాశిలో కుజుడు రాహువు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి, 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటారు. అలాగే మిధునంలోని ఉన్నటువంటి శుక్రుడు ఏడవ తేదీ నుండి కర్కాటకంలోకి వస్తారు. అదేవిధంగా కర్కాటకంలోనే ఉన్నటువంటి రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తాడు.
సింహలో ఉన్న బుధుడు ,చంద్రులు కలిసి ఉంటారు. ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి ,తర్వాత కన్య రాశిలోకి వెళ్తాడు. అలాగే వృశ్చికంలోని కేతువు మకరంలోని ఒకరించినటువంటి శని మీన రాశిలోని ఒకరించినటువంటి గురువు ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే, ఈ యొక్క రాశి నాథుడు కుజుడు ఆరవ స్థానంలో రాహువుతో కలిసి ఉన్నాడు. అయితే ఈ రాశి వారు నేను ధైర్యంగా ఏ పనినైనా చేయగలను అనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
Zodiac Signs : వృశ్చిక రాశి వారు కి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

అలాగే సంతానానికి సంబంధించిన విషయంలో అనుకూలత కనిపిస్తుంది. అలాగే మీరు ధనం ఇచ్చినట్లయితే అవి రావటం లేదు, అనుకున్నా ధనం తిరిగి వస్తుంది. అలాగే గృహాలు కట్టే విషయంలో, విద్యకు సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని కాంట్రాక్టులు కూడా వస్తాయి. అలాగే రాజకీయంగా ఎదిగే అవకాశం కనిపిస్తుంది. రుణాలు కూడా అందే అవకాశం ఉన్నది. 11వ తేదీ నుండి వివాహ విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు. అలాగే 16వ తేదీ నుండి ఉద్యోగ సంబంధించిన విషయాలలో ,గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది.
అలాగే ఈ రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే తరహా కనిపిస్తుంది. అదేవిధంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాలలో, 21వ తేదీ నుండి మంచి ఫలితాలను అందుకుంటారు. కోర్టు కేసు లాంటివి ఒక కోలికి వచ్చే అవకాశం ఉంది. అలాగే రైతులకు చాలా బాగుంది. మీరు ఎదురు చూసే అవకాశాలు మీకు ఎదురుగా వస్తాయి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా మంచి జరగాలంటే… ఈ వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధన: కుజు, రాహువు ల దగ్గర దీపారాధన చేయండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం పాటించాలి. శని భగవాన్ ని ఆరాధన చేయాలి. ఇలా చేయడం వలన అన్ని విధాలుగా మంచి జరుగుతుంది.