Zodiac Signs : ఈ మీన రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : ఆగస్టు నెలలో 2022 ఈ మీన రాశి వారి గ్రహస్తి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేషరాశిలో కుజుడు, రాహువు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి, 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలోని ఉన్నటువంటి శుక్రుడు ఏడవ తేదీ నుండి కర్కాటకంలోకి వస్తాడు. అదేవిధంగా కర్కాటకంలోని ఉన్నటువంటి రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తాడు. సింహంలో ఉన్న బుధుడు, చంద్రులు కలిసి ఉంటారు. ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి, తరువాత కన్యారాశి లోకి వెళ్తాడు.అలాగే వృశ్చికంలోని కేతువు మకరంలోని వక్రరించినటువంటి శని, మీన రాశిలోని వక్రరించినటువంటి గురువు ఉన్నారు.

ఈ మీన రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రాశిలో వక్కిరించినటువంటి గురువు ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారు ఉద్యోగ విషయాలలో, ధనం సంబంధించిన విషయాలలో, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రెండు అడుగులు వెనక్కి వేయడం మంచిది.. లేకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులచే, భూమికి సంబంధించిన విషయాలలో ,ఫ్యాక్టరీల మూలంగా కొద్దిగా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. అలాగే కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ల వల్ల కొన్ని ఒత్తిడిలు కలుగుతాయి. అలాగే గృహాలు కొనుగోలు చేసే విషయాలలో, అలాగే చదువు గురించి తీసుకునే నిర్ణయాలలో 7వ తేదీ వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని లోన్స్ లభిస్తాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.

Zodiac Signs : ఈ మీన రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

horoscope August 2022 Zodiac Signs for Pisces
horoscope August 2022 Zodiac Signs for Pisces

అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారి భాగస్వామికి విద్యకు సంబంధించిన విషయాలలో కానీ, ఒక బిజినెస్ విషయంలో కానీ ,అలాగే భూములు కొనుగోలు చేసే విషయాలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే పార్ట్నర్ షిప్ లతో చేసే బిజినెస్ లలో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. అలాగే 11వ తేదీ నుండి తండ్రి నుంచి, బ్యాంకు నుండి కొంత ధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మాసంలో ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది. అన్ని విషయాలలో మంచి ఫలితాలను అందుకోవాలి అంటే. ఈ మీన రాశి వారు చేయవలసిన దేవతారాధన; శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, అలాగే లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయాలి. అదేవిధంగా సూర్యభగవాన్ని చూస్తూ ఈ యొక్క అష్టోత్తరాలను చదవాలి. ఇలా చేయడం వలన, అన్ని విధాలుగా మంచి ఫలితాలను పొందుతారు.