Janaki Kalaganaledu 01 August Today Episode 356 : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 1 సోమవారం ఎపిసోడ్ 356 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జ్ఞానాంబ వరలక్ష్మి వ్రతానికి అందరికీ బట్టలు తీసుకొచ్చి అందరికీ పిలిచి ఇస్తుంది కానీ జానకి రామాలకు మాత్రం ఇవ్వదు. అప్పుడు గోవిందరాజు జ్ఞానం అందరికీ నీ చేతుల మీదుగా ఇచ్చావు కదా వాళ్లకు కూడా ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు జ్ఞానాంబ వాళ్లకి ఇచ్చే అంత గొప్పదాన్ని నేను కాదండి అని అంటుంది. ఏదైనా పోగొట్టుకున్నంత ఈజీగా మళ్లీ తిరిగి పొందాలంటే కష్టం కదండీ.. అని అంటుంది. చికిత ను పిలిచి గోడ పైన ఉన్న రామ, జానకిల ఫోటోలు తీసేయమని చెప్తుంది. అదేంటి జ్ఞానం అని గోవిందరాజు అడగగా జ్ఞాపకాలనేవి మంచిని మాత్రమే గుర్తు చేసేలా ఉండాలి. మోసాలని నమ్మకాలని పోగొట్టేటట్లు ఉండకూడదు అని అంటుంది. అదంతా చూసి జానకి, రామ చాలా బాధపడతారు. మల్లికా మాత్రం సంతోషంతో డాన్సులు చేస్తూ..పండగ చేసుకుంటుంది. డాన్స్ వేస్తుండగా వచ్చింది అనుకోని మల్లికా ఈ ఇంటి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. నేను మాత్రమే చూసుకోవాలి. అని నటిస్తూ ఉంటుంది. అని అంటూ ఇనికి తిరిగి చూడగానే అక్కడ చికిత ఉంటుంది. అప్పుడు చికిత్స ఏంటండీ తెగ పండగ చేసుకుంటున్నారు.
అంటుంది. ఇప్పుడు నాకు టైం వచ్చింది నేను సంతోష పడుతున్నాను అని అంటుంది. మీరేంటండీ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే సంతోషంతో గెంతులేస్తున్నారు. ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్లు ఇప్పుడు నాకు కూడా ఒక రోజు వచ్చింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని అంటుంది. కట్ చేస్తే జానకి, జ్ఞానాంబ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది.ఇంతలో అక్కడికి రామ వస్తాడు ఏంటండీ జానక గారు ఇంకా రెడీ కాలేదు. నేను రెడీ అయిపోయాను మీరు కూడా రెడీ అవ్వండి అని అంటాడు. అప్పుడు జానకి వద్దులేండి అత్తయ్య గారు నన్ను చూస్తే చీదరించుకుంటున్నారు అని బాధపడుతుంది. అప్పుడు రామ అమ్మ మనసులో ఉన్నది బాదే కానీ ద్వేషం కాదండి.. ఈ వరలక్ష్మి పండగతో అమ్మ లో బాధంతా పోతుంది. మళ్ళీ ఎప్పుడు లాగే మనతో ఉంటుందండి.. మీరు ఏం బాధపడకండి అని అంటాడు. అప్పుడు జానకి నేను రెండు గంటల ముందు అయితే అలాగే అనుకున్నాను. కానీ అత్తయ్య గారు అన్న మాటల్ని చూస్తే తను ఎప్పటికీ క్షమించినట్లు కనిపిస్తుందండి.అత్తయ్య గారు తన కళ్ళ ముందు మన ఫోటో ఉండడానికి సహించలేదు. అలాంటిది మనల్ని క్షమిస్తుంది అని నమ్మకం పోయిందండి. అని అంటుంది. అప్పుడు రామ అలా ఏం జరగదండీ. అమ్మకి ప్రేమ పంచడం తప్ప శపించడం అసలు తెలియదండి.. ఈ పండగ అయిపోయే లోపు మీరు చూడండి. మనల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది.
Janaki Kalaganaledu 01 August Today Episode 356 : గోవిందరాజు మల్లికకు దిమ్మతిరిగే షాక్ ఇస్తాడా

అత్తయ్య గారు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను నా కారణంగా మీ తల్లి కొడుకులు దూరమైపోతున్నారండి. అని బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య గారిని చూసినప్పుడల్లా నాకు తను అన్న మాటలు గుర్తొస్తున్నాయండి. నేను కోడలుగా ఓడిపోయానండి అని పెద్దగా ఏడుస్తుంది. అప్పుడు రామ తనని దగ్గరికి తీసుకొని మీరు ఏంటి మహాలక్ష్మి అండి.. మీరు నా భార్య కావడం నా అదృష్టం, ఈ ఇంటి కోడలు అవడం కూడా ఈ ఇల్లు చేసుకున్న అదృష్టం, మన కారణంగా వచ్చిన ఈ సమస్యను మనమే పోగొట్టుకుందాం. మళ్లీ నమ్మకాన్ని తిరిగి తీసుకొద్దాం. ఈ కన్నీళ్ళని ఆనంద భాష్పాలుగా మార్చుకోవాలి. ఆ క్రమంలో చిన్నచిన్న కష్టాలను ఓర్చుకోవాలండి. నేను వెళ్లి అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తాను మీరు వెళ్లి పూజ ఏం కావాలో చూసుకోండి. మీ కంట్లో కన్నీరు వచ్చిన భర్తగా నేను ఓడిపోయినట్లే మీరు నాకు ఆ పరిస్థితి తీసుకురాకండి.. అని రామ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పూజకు కావాల్సిన సామాన్లన్నీ సర్దుతూ ఉంటుంది.జానకి, ఇంతలో మల్లిక వచ్చి తనని చూస్తూ కుళ్లుకుంటూ ఉంటుంది. జానకి సంతోషాన్ని చెడగొట్టాలి. అని నిర్ణయించుకుంటుంది. అక్కడికి వచ్చి జానకిని ఏం చేస్తున్నావ్ జానకి అని అడుగుతుంది. అప్పుడు మల్లికా కనిపించట్లేదా నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్న అని అంటుంది.
అయ్యో నువ్వు అన్ని మర్చిపోయావా అత్తయ్య గారు నిన్ను ఏం చేయమన్నారు. నీ పెత్తనాన్ని అంతా మూట కట్టి కాలువలోకి విసిరేశారు. నువ్వు ఇంట్లో కుర్చీలు, సోపాలు ఎలాగో నువ్వు కూడా అలాగే, అంతేకానీ కాళ్లున్నాయి గాని కరాటే చేయడం. చేతులున్నాయి గాని పనిలో ఇల్లు పెట్టడం. అత్తయ్య గారు నిన్ను చూస్తే నా మీద మండిపడుతుంది. అని జానకిని అనరాని మాటలు అన్ని అని బాధ పెడుతుంది. అప్పుడు అంతలో గోవిందరాజు అక్కడికి వస్తాడు. అమ్మ మల్లిక నీకు పండగే అనుకుంటా.. అవును మావయ్య గారు వరలక్ష్మి వ్రతం పనులన్నీ నామీద వేసుకొని చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు గోవిందరాజు ఆ పని కాదమ్మా తోటి కోడలు ఆరిపోసుకోవడం అమ్మ.. అయ్యో మావయ్య గారు అలా ఆడిపోసుకోవడం నా బ్రెడ్ లోనే కాదు కిడ్నీలలో కూడా లేదండి అని అంటుంది. అప్పుడు గోవిందరాజు ఈ కార్యక్రమం అంతా అయిపోయే వరకు మీ నోరుని మూసుకోకపోతే బాగోదు అని అంటాడు. అది కాదు మామయ్య గారు అని అనగానే.. గోవిందరాజు చాల్లే ఇక ఛాయాదేవి లాగా బాగా జీవిస్తున్నావు. కానీ నీ పెట్రోల్ పోసే కార్యక్రమాన్ని ఆపేయ్ అని అంటాడు.. గోవిందరాజు. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. అంతే తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందే.