Intinti Gruhalakshmi 1 August Today Episode 699 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 1-August-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం, నందు, తులసికి మ్యూజిక్ స్కూల్ ప్లాన్ గురించి ఎక్స్‌ప్రెన్ చేస్తాడు. అందుకు తులసి ఒప్పుకోదు, ఏమైంది అని అనగానే, మీరు చెప్పినదాని ప్రకారం మ్యూజిక్ స్కూల్ పక్కన, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్ ,కూడా ఉంటాయి అని అన్నారు అలా అయితే, మ్యూజిక్ స్కూల్ కి ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడైనా మ్యూజిక్ నేర్చుకొనే చోటు ప్రశాంతంగా ఉండాలి. ఈ ఐడియా నాకు నచ్చలేదు. అని అనగానే, మీ లాభం కోసం కంపెనీ నష్టపోవద్దు కదా అని అంటాడు నందు.అయితే ఈ మ్యూజిక్ స్కూలే వద్దు అని తులసి అనగానే, వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. తులసి అత్తామామలు తొందర పడుతున్నావు ఏమో అమ్మ మన అవసరం కూడా చూసుకోవాలి కదా అని అనగానే, ప్రేమ్ ఆత్మాభిమానం ముందు అవసరాలు చిన్నది అని అంటాడు.
మీరేం టెన్షన్ పడకండి ఏది జరగాలో అదే జరుగుతుంది అని తులసి వెళ్లిపోతుంది. లాస్య, నందు కారులో వెళుతూ కావాలనే తులసి ఇలా చేస్తుంది అని అనుకుంటూ, కొద్దిసేపు తులసి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ప్రేమ్ కూర్చుని, బుక్‌లో శృతి గురించి నువ్వు పనిమనిషిల చేసినందుకు నాకు బాధలేదు, నా బాస్ అలా అవమానించినందుకు బాధవేసింది, తాగి నేను తప్పుగా మాట్లాడాను. నా చొక్కా పట్టుకొని నిందించే హక్కు నీకు ఉంది, ఎందుకు అలా చెయ్యకుండా వెళ్లిపోయి, చాలా పెద్ద శిక్ష వేశావు అని అనుకుంటూ ఉంటాడు.ఒకవైపు శృతి కూడా ప్రేమ్ గురించి ఆలోచిస్తూ, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది, ఇలా అవుతుందని అనుకోలేదు, అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇంతలో అంకిత ప్రేమ్ దగ్గరికి వస్తుంది.తాతయ్య పిలుస్తున్నాడు రమ్మని అంటుంది.
Intinti Gruhalakshmi 1 August Today Episode 699 : నందు ఐడియాను కాదని తులసి చెప్పినట్టు చెయ్యమని నందుతో చెప్పిన సామ్రాట్

ఇంతలో రూమ్ అంతా చిందర వందర ఉండేసరికి, నేను సదురుతాను, నువ్వు వెళ్లు అని అంటుంది. ప్రేమ్ రాసిన డైరీ ని చూసి షాక్ అవుతుంది అంకిత. తర్వాత నంద, లాస్య సామ్రాట్ దగ్గరికి వెళతారు. తులసి కుాడా అక్కడే ఉంటుంది. నందు సామ్రాట్‌తో లాభం లేకుండా ఏ పని చేయలేం అని మాట్లాడుతూ ఉండగా, అప్పుడు తులసి ఈ రోజుల్లో చదువు ని కూడా సంపాదన తో చూస్తున్నారు. కనీసం సంగీతాన్నైనా అలా చూడొద్దు అని, సంగీతం గురించి కొన్ని మంచి మాటలు, గొప్పగా చెబుతూ ఉంటుంది. తులసి సామ్రాట్‌తో మీకు నష్టం కలిగించాలి అని కాదు సార్, మీకు మంచి పేరు తేవాలని నేను అనుకుంటున్నాను, నా మీద నమ్మకం లేకపోతే చెప్పండి నేను వేరే దారి చూసుకుంటాను.ఏ చెట్టుకిందో పాఠాలు చెప్పుకుంటాను అని, మీ వ్యాపారాలు మీరు చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతూండగా, అప్పుడు సామ్రాట్ కూర్చోండి తులసిగారు అని, నందూతో ఎలాగైనా తులసి గారు చెప్పినట్టు డిజైన్ చేయండి.
అని చెప్పి, తులసితో మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించడంలో మీకు ఎప్పుడు సపోర్టుగా ఉంటాను, అని తులసితో అంటాడు. తరువాత అంకిత, ప్రేమ్ తొ శ్రుతి గురించి మాట్లాడుతూ, మీ డైరీ చదవడం తప్పే, కానీ ఇంట్లో మనిషివి అని నేను చదివాను. ఏ పెద్ద సమస్య అయినా తల్లికి చెప్పుకోవాలి అనేసరికి, నేను చెబితే శ్రుతి విషయంలో అలా ప్రవర్తించానని తన పెంపకం తప్పనుకుని, అమ్మ బాధపడుతుంది. అమ్మకు తెలిసేలోపే నేనే శ్రుతి ని వెతుకుతాను, అని అంటూ ఉంటాడు. నువ్వు చెప్పకుండా ఆంటీకి తెలిస్తే ,ఆంటీ ఇంకా చాలా బాధపడుతది, అని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. సామ్రాట్ ఇంటికి రాగానే, హనీ పాప డల్‌గా కూర్చొని ఉంటుంది. ఏమైంది అమ్మా అని అడిగితే, ఇల్లంటే చుట్టూ పనివాళ్లు, పెద్ద బంగ్లా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు, అని అంటూ ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.