Vastu Tips : ప్రతి ఒక్కరి ఇంట్లో సకల శుభాలు కలగాలని తులసి మొక్కను పెంచుకుంటారు. ఈ మొక్క వ్యాధుల నుండి కాపాడుతుంది. అయితే శ్రావణమాసంలో తులసి చెట్టు నాటడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రానిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం శ్రావణమాసంలో తులసి మొక్కతో పాటు కొన్నిరకాల పండ్లు, పూల మొక్కలు నాటితే ఆ ఇంట్లో ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయిని శాస్త్రం పేర్కొంది. అయితే శ్రావణ మాసంలో ఎటువంటి మొక్కలు నాటితే ఆర్థిక సమస్యలు ,మానసిక సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణమాసంలో లోకాలకు అధిపతి అయిన విష్ణువుని పూజిస్తారు. అదేవిధంగా బెల్లం తో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.
అంతేకాకుండా శివునికి ఇష్టమైన పత్రి ఆకులను పూజా లో ఉంచుతారు. శ్రావణమాసంలో ఈ మొక్కను నాటడం వల్ల వాస్తు దోషాలు తొలగింపబడతాయి. వాస్తులు జమ్మి చెట్టుని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ చెట్టు నీ నాటడం ద్వారా శని దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. శ్రావణ మాసంలో తులసి చెట్టుతో పాటు జమ్మి చెట్టు నాడడం వల్ల ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి అని వాస్తు నిపుణులు సూచించారు. శివునికి ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పూజలో ఈ పూలను ఆయనకు తప్పకుండా సమర్పించాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శ్రావణమాసంలో మంగళవారం లేదా ఆదివారం రోజున ఈ మొక్కను నాటడం వల్ల శివుని అనుగ్రహం ఆ ఇంట్లో వారందరికీ ఉంటుంది.
Vastu Tips : శ్రావణమాసంలో తులసి మొక్కతో పాటు ఈ మొక్కని నాటండి

ఇంట్లో అరటి మొక్కలు నాడడం వల్ల బృహస్పతి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం పేరుకుంది. అయితే శ్రావణ మాసంలో తులసి మొక్కతో పాటు అరటి మొక్కను నాడడం వల్ల ఆ ఆర్థిక పరమైన సమస్యలు దూరం అవుతాయని శాస్త్రం వెల్లడించారు. అయితే అరటి మొక్కను నాటేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ రెండు మొక్కలను కలిపి నాటడం మంచిది కాదని అయితే ఇంటి ప్రథమ ద్వారానికి ఎడమవైపు తులసి మొక్కని నాటాలి కుడివైపు అరటి చెట్టును నాటడం మంచిది. శ్రావణమాసంలో సంపంగి మొక్కని నాటడం శ్రేయస్కరం. ఈ చెట్టు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీనిని నాటడం వల్ల ఇంట్లో ధన ప్రాప్తి లభిస్తుంది అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.